Begin typing your search above and press return to search.
12 కథలు రిజెక్ట్ చేసిన అనసూయ
By: Tupaki Desk | 8 Aug 2019 8:12 AM GMTఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా కనిపిస్తూనే మరోవైపు తనకి పర్ ఫెక్ట్ అనిపించే క్యారెక్టర్స్ తో వెండితెరపై వెలుగుతుంది అనసూయ. క్షణం - రంగస్థలం - యాత్రలో అనసూయ చేసిన క్యారెక్టర్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే అలాంటి పవర్ ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ తో కథనం సినిమా చేసింది అనసూయ.
ఈ సినిమాలో ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన అనసూయ ఈ సినిమా కంటే ముందు 12 కథలు విన్నానని అవేవి తనకి కనెక్ట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. అయితే కథనం ఎందుకో చేశానన్నది మాత్రం సినిమా చూస్తే అర్థమయి పోతుందని తెలిపింది.ఇది కాకుండా మరో సినిమా కూడా చేశానని అదొక డిఫటెంట్ ఎక్స్ పీరియన్స్ అని ఆ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుందని - అంతకంటే ఆ సినిమా గురించి ఏం చెప్పలేనని అన్ని డిటైల్స్ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తాయని చెప్పుకొచ్చింది.
కథనం సినిమాలో తను ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఇంకా చాలా మంది నటీ నటులు పనిచేశారని కానీ ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించి భాద్యత మాత్రం తనమీదే ఉందని అందుకే మీడియా ముందుకొచ్చానని చెప్పింది. సినిమా చూసాక సోషల్ మీడియా ద్వారా తనను ట్యాగ్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరింది.