Begin typing your search above and press return to search.
వారిని వదలొద్దు..పోలీసులకు అనసూయ వినతి
By: Tupaki Desk | 19 July 2018 5:03 AM GMTఅనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఓ వ్యక్తి బండారాన్ని ట్విట్టర్ సాక్షిగా బయటపెట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడిది వైరల్ గా మారింది. అనసూయ చేసిన పనికి కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ఓవరాక్షన్ చేస్తున్నావంటూ మండిపడుతున్నారు. దీనికి అనసూయ కూడా సీరియస్ గానే కౌంటర్లు ఇస్తోంది. ఇలా అనసూయ కామెంట్స్ - నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.
అనసూయ గతంలో బెంగళూరుకు తన ఫ్యామిలీతో కలిసి వెళుతోంది. ఆ సమయంలోనే ఎదురుగా ఫుల్ గా మద్యం తాగి కారు నడుపుతూ వచ్చిన ఓ వ్యక్తి అనసూయ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు బోల్తాపడింది. అదృష్టవశాత్తూ కార్లోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనసూయతో పాటు ఆమె భర్త - పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఆ సంఘటనతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డ అనసూయ... కారు నిర్లక్ష్యంగా నడిపేవారు కనిపిస్తే చాలు కోపంతో ఊగిపోతోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి చేసిన పనిని వీడియో తీసి ట్విట్టర్ లో హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేసింది.
బుధవారం సాయంత్రం అనుసూయ ఇంటికి వెళుతుండగా.. ఓ వ్యక్తి వీడియోలు చూస్తూ కారు నడుపుతూ కనిపించాడు. దీన్ని ఆమె తన ఫోన్లో వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇలా నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడింది. వీరు మూలంగా తప్పు చేయని వారు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోయింది. నేను కూడా గతంలో ఇలా నిర్లక్ష్యం కారణంగానే యాక్సిడెంట్ ఫేస్ చేశానని తెలిపింది. ఇలాంటి వారిని వదలద్దు అంటూ పోలీసులకు షేర్ చేసి ట్వీట్ చేసింది.
అయితే అనసూయ ట్వీట్ పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వీడియో తీసే బదులు దిగి చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. ‘అప్పట్లో ఓ పిల్లాడికి ఇలా చెబతే చాలా పెద్ద రచ్చ చేశారు. మేం కెమెరా ముందే నటిస్తామండి.. బయట సాధారణ జనాలమే..’ గుర్తించండి అంటూ అనసూయ వాపోయింది.