Begin typing your search above and press return to search.
అనసూయ ఆంటీని అలా అపార్థం చేసుకుంటారేంటి?
By: Tupaki Desk | 23 March 2020 2:10 PM ISTలాక్ డౌన్ ఎవరికి వర్తించదు?బుల్లితెర.. వెండితెర తేడా లేకుండా వెలిగిపోయే సెలబ్రిటీలు కొద్దిమందే ఉంటారు. వారిలోనూ.. సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ మరికొద్ది మందే. ఇలా.. మీడియా ఏదైనా సరే.. తనకున్న పాపులార్టీ తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే సెలబ్రిటీల్లో అనసూయ ఆంటీ ఒకరు. కామెడీలో రొమాటింక్ బ్లెండ్ ను మిక్స్ చేసి.. దానికి తన గ్లామర్ ను యాడ్ చేసి.. తెలుగు ప్రజల్ని పిచ్చెక్కించే అనసూయ తాజాగా పెట్టిన ఒక పోస్టు ఇప్పుడామెను తిట్టిపోస్తున్నారు.
అదే పనిగా ట్రోల్ చేస్తూ.. విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. దీనికి.. ఆమె తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టులో ఏముంది? దానికి ఎందుకంతగా తప్పు పడుతున్నారు? అన్నది చూస్తే.. తెలంగాణ లాక్ డౌన్ మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ప్యాకేజీని ట్యాగ్ చేస్తూ.. ఆమె ఒక విన్నపాన్ని చేశారు. మేం కూడా నెల నెలా అద్దెలు కట్టాలి. పవర్ బిల్లులు.. ఈఎంఐలు కట్టాలి. వేతన జీవులమైన మా మీదా కాస్త దయ చూపండి అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు.
అనసూయ ఆంటీ ట్వీట్ ను అర్థం చేసుకోవటం కంటే అపార్థమే ఎక్కువగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. తన ట్వీట్ లో ఆమె తన గురించి కాకుండా.. మాలాంటి వాళ్లు అన్న అర్థం వచ్చేలా చేశారు. అందులో తన గురించి కానీ.. మధ్యతరగతి.. ఎగువ మధ్య తరగతి వారి ఈతి బాధలు ఏమిటి సామీ అన్నట్లుగా ఆమె పోస్టు ఉంది. కానీ.. ఆమె ట్వీట్ కు స్పందిస్తున్న వారంతా ఆమె ట్వీట్ కు పాజిటివ్ కంటే నెగిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు.
నీ సంగతే ఇలా ఉంటే.. మాలాంటి మధ్యతరగతి వారి సంగతేంటి? దేన్లో దూకి చావాలంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ.. ఆమె స్పందిస్తూ.. నేను నా గురించి చెప్పలేదు.. ‘వియు’ అన్నది వదిలేసి.. ఇలా అనేస్తారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. వాస్తవ కోణంలో చూస్తే.. అనసూయ ఆంటీ లేవనెత్తిన వాదనలో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఆమె చెప్పినట్లే పేరుకు మధ్యతరగతి. . ఎగువ మధ్యతరగతి వారంతా ఇప్పుడంతా అమెరికన్ ఎకానమీని ఫాలో అవుతున్న విషయాన్ని మర్చిపోకూడదు.
సంపాదన మొత్తాన్నిసేవింగ్స్ కంటే ఖర్చు చేయటానికి.. వచ్చింది వచ్చినట్లుగా లెక్క పెట్టుకొని ఈఎంఐ కిస్తీలకు సెట్ చేసుకున్న వేళ.. కరోనా లాంటి కంగాళి వాతావరణం నెలకన్నప్పుడు ఇలాంటి వారికి తీవ్ర ఇబ్బందులకు గురికావటం ఖాయం. పేరుకు ఇల్లు.. కారు అన్ని ఉండొచ్చు. బండి చక్రం బాగా నడుస్తున్నంత వరకూ ఓకే. ఏదైనా అనుకోని ఉత్పాతం ఎదురైతే.. అలాంటి వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటిదేదో ప్రస్తావిద్దామన్న ప్రయత్నంలో అనసూయ పెట్టిన పోస్టు ప్రజలకు వేరేలా అర్థమైందని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే.. ఆంటీ ట్వీట్ ను అర్థం కంటే అపార్థమే ఎక్కువగా చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఏదో.. కాస్త క్లాస్ సెక్షన్ బాధలు చెప్పాలనుకున్న దానికి తిట్టి పోసేసిన వైనం ఆమెకు షాకింగ్ గా మారిందంటున్నారు.