Begin typing your search above and press return to search.

ఆవేదనలో అనసూయ అసహనం

By:  Tupaki Desk   |   10 Feb 2016 4:58 AM GMT
ఆవేదనలో అనసూయ అసహనం
X
టీవీ యాంకర్ నుంచి సినిమా నటిగా మారిన అనసూయకు.. తెలుగు ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ ఉంది. అలాగే ఆమెపై విమర్శలు చేసే వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ముఖ్యంగా అనసూయ డ్రస్సింగ్ గురించి నెగిటివ్ కామెంట్స్ బాగానే వస్తుంటాయి. ఈ మధ్య ఇలాంటివి ఎక్కువయ్యాయి కూడా. అమ్మ అయ్యాక కూడా పద్ధతిగా ఉండకుండా గ్లామర్ షో చేస్తోందని విమర్శలకు.. అనసూయ స్వయంగా సమాధానం ఇచ్చింది.

'మీరంతా మీ జీవితాల్లో విసుగెత్తిపోయి ఉంటారు. అవతలి వాళ్ల జీవితాల గురించి ఆలోచించే బదులు.. ఆ సమయాన్ని మీకోసం వెచ్చిస్తే, మీరు ఈ పాటికే సక్సస్ అయ్యేవాళ్లని గుర్తు పెట్టుకోండి. నేను, నా భర్త ఏం చేసినా మా బతుకుల కోసమే. రోమ్ లో ఉన్నపుడు రోమన్ లాగా ఉండాలి కదా. అలాగే నేను కూడా. ఇప్పుడు చేస్తున్నదంతా ప్రొఫెషన్ మాత్రమే. నా పర్సనల్ కాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకునే భర్త ఉండడం నా అదృష్టం' అంటూ పోస్ట్ చేసింది అనసూయ.

ఇక్కడితో ఆగకుండా.. ఒక వేళ తను చేసే పనులు నచ్చకపోతే పక్కన పెట్టేయండి అంతే కానీ.. ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడమంటే.. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా పెంచలేదన్న మాట అంటూ ఘాటుగానే రెస్పాండ్ అయింది. మీ బెటర్ మెంట్ కోసం ప్రార్ధిస్తాంటూ పోస్ట్ క్లోజ్ చేసింది.