Begin typing your search above and press return to search.
ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోతా: అనసూయ
By: Tupaki Desk | 20 Feb 2016 5:00 PM ISTఅనసూయ భరద్వాజ్.. ఈ పేరు వినగానే కుర్రకారు వెర్రెత్తిపోతుంది. టీవీ యాంకర్లలో ఎవరికీ లేనంత క్రేజ్ అనసూయకు వుంది. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘క్షణం’ మూవీలో జయ భరద్వాజ్ గా కాప్ పాత్రలో నటిస్తోంది. నూతన దర్శకుడు రవికాంత్ డైరెక్షన్ లో అడవి శేష్ - ఆదాశర్మ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ప్రముఖ యాంకర్ - హాట్ బ్యూటీ అనసూయ ఏసీపీగా నటించింది. ఈ సందర్భంగా అనసూయ మీడియాతో మాట్లాడుతూ ‘నాకు అడవి శేష్ స్క్రిప్టు వినిపించాడు. కొత్తగా అనిపించింది. అందులోనూ పోలీసు పాత్రలో నటించడం నాకు సవాలు లాంటిదే. ఇందులోనే ఏసీపీ జయ భరద్వాజ్ పేరుతో నటిస్తున్నా. దీనికోసం చాలా సినిమాలు చూశా. షూటింగ్ మొదలయ్యే సమయానికి కాన్ఫిడెంట్ వచ్చింది. దాంతో కాప్ పాత్రలో ఒదిగిపోయా. ఇప్పటి వరకు నేను యాంకర్ గానే కనిపించా. నాగార్జున మీద వున్న అభిమానంతో సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నటించా. అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆచి తూచి అడుగు వేస్తున్నా’ అన్నారు.
ఇంకా అనసూయ మాట్లాడుతూ ‘నాకు ఎంత మంది ఫాలోయింగ్ వున్నారో.. అంతే మంది శత్రువులు వున్నారు. కానీ పట్టించుకోను. రూమర్స్ చాలానే వస్తుంటాయి. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోతా. కానీ నా కుటుంబం వెన్నంటి వుండి ప్రోత్సహిస్తుంది. ఎంటర్ టైన్ చేయడమే నా ముందున్న లక్ష్యం. టీవీ షోస్ తోనే నేను ఇంత పాపులర్ అయ్యా. మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తా. క్షణం మూవీ సస్పె డ్రామాతో ఎంతో ఆసక్తిగా తెరకెక్కించాడు దర్శకుడు రవికాంత్. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారిగా డీసెంట్ పాత్రలో నటించా. ఖాకీ దుస్తుల్లో నేను కనిపించను. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగా ప్లస్’ అన్నారు.