Begin typing your search above and press return to search.
బన్నీతో అనసూయ.. వాటే జోక్
By: Tupaki Desk | 17 March 2016 5:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణంగా పుడుతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి క్లారిటీ కావాలంటే.. ఆయా వ్యక్తులు పర్సనల్ ఇంటర్వ్యూలు ఇవ్వాలి తప్ప.. సహజంగా ఎవరూ స్పందించరు. సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఎప్పటికప్పుడు రూమర్స్ ను ఖండించే ఛాన్స్ సెలబ్రిటీలకు వచ్చింది. ఇలా తనపై వచ్చే రూమర్స్ పై స్పందించడంలో.. యాంకర్ నుంచి యాక్టర్ గా తనను తాను ప్రమోట్ చేసుకున్న అనసూయ స్పీడ్ చూపిస్తూ ఉంటుంది.
ఎలాంటి రూమర్స్ వచ్చినా, విమర్శలు వచ్చినా.. వాటిపై రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి కసురుకున్నట్లుగా స్పందించినా.. రియాక్షన్ రావడం అయితే పక్కా. సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేయబోయే మూవీ కోసం అనసూయను అడిగారంటూ ఓ వార్త షికారు చేస్తోంది. దీనిపై కూడా అనసూయ రియాక్ట్ అవుతూ.. అలాంటి ఆఫర్ ఏమీ లేదని తేల్చేసింది. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అంటూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది అనసూయ.
అయితే.. ఈ రూమర్ బాగానే స్ప్రెడ్ అయినా మెగా ఫ్యాన్స్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దీనికో కారణం ఉంది. వాళ్ల లెక్క ప్రకారం బన్నీ సినిమాలో చేసే ఛాన్స్ అనసూయకు ఎప్పటికీ రాదంటున్నారు అభిమానులు. దీనికి కూడా ఓ స్పెషల్ రీజన్ ఉంది. గంగోత్రి సినిమాలో స్టైలిష్ స్టార్ లుక్ పై అనసూయ కామెంట్స్ చేయడంతో, ఇలాంటి ఆఫర్ ఆమెకు ఎప్పటికీ రాదన్నది వారి లెక్క.