Begin typing your search above and press return to search.
నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను: స్టార్ యాంకర్
By: Tupaki Desk | 20 Jun 2020 9:30 AM GMTటాలీవుడ్ బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ గ్లామరస్ బ్యూటీ బుల్లితెర పైనే కాదు ప్రస్తుతం వెండితెర పై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక అందాలతో మాయ చేయడం అనసూయకు కొత్తేమీ కాదు. టీవీ సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన అనసూయ.. ఎల్లప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక అనసూయ అలవాట్లు అభిరుచులు అభిప్రాయాలు ఇష్టాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా తన గ్లామర్ మైంటెనెన్సుకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. "నేను రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్ అని నేను అనుకుంటున్నాను.
నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను. అది నా గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ మాత్రమే అలవాటు చేసుకున్నాను. వైన్ అనేది గుండెకు ఎంతో మంచిది. అందుకే రోజు ఒక గ్లాస్ అయినా తీసుకుంటాను. వైన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను. ఉపవాసాలు అంటారా.. అవంటే నాకు అసలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానంటుంది గ్లామరస్ యాంకరమ్మ. అందరి సంగతి పక్కన పెడితే నాకు మాత్రం వైన్ బాగా పనిచేస్తోందిని" అంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనసూయ సినిమాలలో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా విలక్షణ పాత్రలు కూడా చేస్తుంది. క్షణం, రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.