Begin typing your search above and press return to search.
రంగమార్తాండలో రంగమ్మత్తకు మించి..!
By: Tupaki Desk | 18 Sep 2020 12:50 PM GMTఅనసూయ అనగానే బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్.. వెండి తెర ప్రేక్షకులకు రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర గుర్తుకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రంగమ్మత్త పాత్ర ను అనసూయ చేసి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికి ప్రేక్షకులు ఆ పాత్రను మర్చిపోలేక పోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకు మించిన పాత్ర వస్తే తప్ప రంగమ్మత్తను ప్రేక్షకులు మైండ్ నుండి తొలగించే పరిస్థితి ఉండదు. త్వరలో రంగమ్మత్త ప్రేక్షకుల మైండ్ నుండి పోయి మరో పాత్రతో అనసూయ నిలువబోతుందట.
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో అనసూయ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమాలో అనసూయ దేవదాసి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సినిమాలో అనసూయ బాడీ లాంగ్వేజ్ మరియు ఆమె తీరు ప్రేక్షకులకు చాలా కాలం పాటు గుర్తుండి పోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ కు కరోనా అంతరాయం కలిగించింది. త్వరలోనే షూటింగ్ ను పునః ప్రారంభించి వచ్చే ఏడాది వరకు రంగమార్తాండను విడుదల చేయాలని భావిస్తున్నారు.
దేవాలయ ఉత్సవాల్లో డాన్స్ లు చేస్తూ పెళ్లి చేసుకోకుండా అందరికి ఒకే వరుసతో ఉండే దేవదాసి పాత్రలో అనసూయ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రంగమార్తాండ సినిమాలో బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ మరియు శివాత్మిక రాజశేఖర్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.