Begin typing your search above and press return to search.
అనసూయ ఉంటే హిట్.. వద్దంటే ఇండస్ట్రీ హిట్
By: Tupaki Desk | 4 March 2016 1:00 PM ISTసెక్సీ యాంకర్ నుంచి కేరక్టర్ యాక్టర్ గా మారిపోయిన అనసూయ.. ఇప్పుడు లక్కీ హ్యాండ్ - గోల్డెన్ లెగ్ అనే బిరుదులు కూడా సంపాదించేసుకుంది. ఈ భామ నటించిన రెండు సినిమాలు మంచి హిట్స్ సాధించాయి. నాగార్జునతో కలిసి సోగ్గాడే చిన్ని నాయనలో కాసేపు మెరిసినా, క్షణంలో కేరక్టర్ రోల్ చేసినా అవి రెండూ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడీ భామను రామ్ చరణ్ మూవీ ధృవలోకి కూడా తీసుకున్నారనే రూమర్స్ రాగా.. వాటిని ఖండించింది అనసూయ.
చెర్రీ సినిమాలో అనసూయ చేయడం లేదనే వార్త తెలిసినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ బాగా హ్యాపీ అయిపోతున్నారు. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది కోసం అనసూయను అడగ్గా.. తను ఆ ప్రాజెక్ట్ చేయలేదు. ఇప్పుడు అనసూయ కేరక్టర్ విషయంలో చెర్రీ సినిమాకి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అంటే.. రిజల్ట్ కూడా అదే రేంజ్ లో రిపీట్ అవుతుందన్నది మెగా ఫ్యాన్స్ వాదన. అంటే అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అయి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో.. ఇప్పుడు చరణ్ సినిమా కూడా ఇదే ఫీట్ రిపీట్ చేసేయాలన్న మాట.
ఏమైనా అనసూయ పై సెంటిమెంట్స్ భలేగా ఉన్నాయి. ఈ భామ సినిమా చేస్తే సూపర్ హిట్ గ్యారంటీ అయితే.. తప్పుకుంటే ఇండస్ట్రీ హిట్ అన్నమాట. ఈ లెక్కన అనసూయ అన్న పేరే ఓ బ్రాండ్ అయిపోద్దేమో కొన్నాళ్లకి.