Begin typing your search above and press return to search.

టీజింగ్ బాగుంది అనసూయ.. కాని..

By:  Tupaki Desk   |   8 March 2018 8:35 AM GMT
టీజింగ్ బాగుంది అనసూయ.. కాని..
X
ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోయినా కూడా తన టీజింగ్ ను కొనసాగిస్తోంది యాంకర్ అనసూయ. అసలు యాంకర్లంటే సుమ అండ్ ఝాన్సీ తరహాలో దారాళంగా మాట్టాడితేనే క్లిక్ అవుతారా? గ్లామర్ తో కూడా క్లిక్కవ్వచ్చు తెలుసా అంటూ ప్రూవ్ చేసిన తొలి హాట్ లేడీ అంటే ఈమె పేరునే చెబుతారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ వంటి మాధ్యమాల నుండి అమ్మడు విరామం తీసుకున్నాక.. ఈమె తళుకుబెళుకులు పెద్దగా బయటకు రావట్లేదు.

వచ్చే వారం అనసూయ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఎలా కనిపించనుందో.. ఆమెను స్టయిలింగ్ చేస్తున్న ఫ్యాషన్ డిజైనర్ ఒకరు ఇప్పుడు అభిమానులతో పంచుకున్నారు. రొటీన్ పోల్కా డాట్ చీరలో డిఫరెంట్ గా ఉంటే కిటికీల జాకెట్ వేసుకుని అదిగో అలా హొయలు వలికిస్తోంది అనసూయ. అయితే ఈ సెక్సీ లుక్ అంతా బాగానే ఉంది కాని.. అనసూయ మాత్రం తన ఒంపుసొంపులపై ఏమాత్రం కంట్రోల్ లేకుండా కాస్త నమిత తరహాలో లావెక్కుతోందనే కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.

అసలే అల్లంత ఎత్తు లేస్తుంది అనసూయ. అదేంటమ్మా కాస్త బొద్దెక్కావ్ అంటే.. నా బాడీ నా ఇష్టం.. ఇదే ఫెమినిజం.. అంటూ మరో క్లాస్ పీకుతుందని ఇప్పుడు చాలామంది జోకులు కూడా వేస్తున్నారు. ఏదేమైనా కూడా.. బాలీవుడ్ లో మలైకా అరోరా తరహాలో అనసూయ కూడా ఫిట్ ఫిజిక్ మెయిన్టయిన్ చేస్తే మాత్రం చాలామంది యువకులు గుండెలు ఫట్ అని పేలిపోతాయ్. కాదంటారా?