Begin typing your search above and press return to search.

ఆ హీరో ఇంటెన్స్ అంటూ చిచ్చు పెట్టిన అన‌సూయ‌

By:  Tupaki Desk   |   10 July 2023 10:28 PM GMT
ఆ హీరో ఇంటెన్స్ అంటూ చిచ్చు పెట్టిన అన‌సూయ‌
X
అన‌సూయ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ వివాదం గురించి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లో అభిమానుల మ‌ధ్య బోలెడంత డిబేట్ న‌డిచింది. అర్జున్ రెడ్డిలో త‌ల్లి గురించి కించ‌ప‌రుస్తూ మాట్లాడే భాష‌ను అన‌సూయ త‌ప్పు ప‌ట్టింది. త‌ల్లుల‌ను బాగా కించ‌ప‌రిచారంటూ విమ‌ర్శించింది.

దీంతో దేవ‌ర‌కొండ అభిమానులు అనసూయను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాల్లో డిబేట్లు పెట్టారు. అప్పటి నుండి అనసూయ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

అయితే ఇంత‌లోనే అనూహ్య‌మైన మార్పు. ఇలాంటి వివాదాల‌కు ఇక స్వస్తి చెప్పాలని ఇటీవ‌ల అన‌సూయ‌ బహిరంగంగా చెప్పడంతో ప‌రిస్థితి కొంత స‌ద్దుమ‌ణిగింది. అనసూయ ఇప్పుడు విజయ్ దేవ‌ర‌కొండ‌ సోదరుడు ఆనంద్ దేవరకొండ చిత్రం 'బేబీ'పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అనసూయ ట్విటర్ లో ఇలా రాసారు. ''పార్టీకి చాలా ఆలస్యం అయింది.. కానీ ఎప్పుడూ లేనంత ఆలస్యం.. లవ్ లవ్ లుయూయూర్ర్ర్వ్ ఈ ట్రైలర్ కి సంబంధించిన ఒరిజినాలిటీ.. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తుంది.. వేచి ఉండలేను దాని కోసం.. మీ గురించి ఎప్పుడూ గర్వపడుతున్నాను సాయిరాజేష్ గారూ!!'' అంటూ ట్వీట్ చేసింది. విరాజ్ అశ్విన్ మీరు చాలా కూల్ గా ఉన్నారు.. ఆనంద్ దేవ‌ర‌కొండ చాలా ఇంటెన్స్ గా ఉన్నారు.. అని కూడా రాసారు.

ఆనంద్ ని పొగిడేస్తూ బేబీ చిత్రంపై అనసూయ చేసిన ట్వీట్ వేడెక్కిస్తోంది. ఇది నిజంగా పొగడ్తనా లేదా వ్యంగ్యమా? అనేది అర్థంగాక చాలా మంది షాక్ లో ఉన్నారు. బేబీ కథ తన పరిచయస్తుల నిజ జీవిత కథను పోలి ఉంటుందని కూడా అన‌సూయ చెబుతోంది.

ఏది ఏమైనా కానీ అన‌సూయ ట్వీట్ల‌కు స్పంద‌నలు ఇంటెన్స్ గానే ఉన్నాయి. జూ.దేవ‌ర‌కొండ‌ను పొగ‌డ‌టం అంటే పెద్ద దేవ‌ర‌కొండ‌ను తెగ‌డ‌ట‌మేనా? అని కూడా కొంద‌రు నెటిజ‌నులు సందేహిస్తున్నారు.