Begin typing your search above and press return to search.
థ్యాంక్ యు బ్రదర్' కోసం అనసూయ రోజుకు అంత తీసుకుందా..?
By: Tupaki Desk | 5 May 2021 9:00 PM ISTఅనసూయ భరద్వాజ్ - అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలతో రూపొందిన చిత్రం ''థ్యాంక్ యు బ్రదర్''. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ‘ఆహా’లో మే 7న విడుదల చేస్తున్నారు. ఇందులో అనసూయ నిండు గర్భిణిగా నటించింది. దీని కోసం ఆమె రోజుకు రూ.1.5 లక్షల చొప్పున 17 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ చిత్రానికి గానూ అనసూయకు 25 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ గా అందినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె రెగ్యులర్ గా చేసే షోలు ఇతర సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ ని డిస్టర్బ్ చేయకుండానే అనసూయ ఈ సినిమాని కంప్లీట్ చేసిందని టాక్ నడుస్తోంది.
కాగా, 'థ్యాంక్ యు బ్రదర్' చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై మాగుంట శరత్ చంద్రారెడ్డి - తారకనాథ్ బొమ్మిరెడ్డిలు కలసి నిర్మించారు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం సమకూర్చగా.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో ఆదర్శ్ బాలకృష్ణ - వైవా హర్ష - అర్చనా అనంత్ - అనీష్ కురువిల్లా - మౌనికా రెడ్డి - కాదంబరి కిరణ్ - అన్నపూర్ణ - బాబీ రాఘవేంద్ర - సమీర్ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట్రికల్ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లలో విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. మరి 'థ్యాంక్ యు బ్రదర్' సినిమా అనసూయకు ఏకాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.