Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు నవ్విన అనసూయ నవ్వించే సిల్వర్ ప్రయత్నం!

By:  Tupaki Desk   |   13 March 2022 11:30 PM GMT
ఇన్నాళ్లు నవ్విన అనసూయ నవ్వించే సిల్వర్ ప్రయత్నం!
X
జబర్దస్త్ అనగానే గుర్తుకు వచ్చే మొదటి రెండు మూడు పేర్లలో కచ్చితంగా అనసూయ పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు. జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం సినిమాలతో కూడా బిజీగా ఉంది. యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో స్టార్ గా మారిపోయింది. ఆమె సిల్వర్ స్క్రీన్ పై స్టార్‌ గా గుర్తింపు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

రంగస్థలం సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర కు అనూహ్యంగా మంచి పేరు రావడంతో ఆ తర్వాత నుండి వరుసగా అనసూయకు పెద్ద సినిమాల్లో మరియు చిన్న సినిమాల్లో ప్రముఖ పాత్రల్లో నటించే అవకాశాలు దక్కుతున్నాయి. ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప లో కూడా అనసూయ కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

జబర్దస్త్ కమెడియన్స్ చేసే కామెడీ కొన్నిసార్లు ప్రేక్షకులకు నచ్చదు. అలాంటి కామెడీకి కూడా జడ్జ్‌ లు మరియు యాంకర్లు నవ్వాల్సిందే. కమెడియన్స్ చేసిన కామెడీ నచ్చినా నచ్చకున్నా మొహం పై నవ్వు చెరగకుండా నవ్వుతూనే ఉండాలి. అలాంటి అనసూయ మొదటిసారి నవ్వించడానికి సిద్ధం అయింది. ఇన్నాళ్లు నవ్విన అనసూయ ఇప్పుడు నవ్వించేందుకు స్వయంగా కామెడీ చేయబోతుంది.

జయశంకర్ అనే దర్శకుడి దర్శకత్వం అనసూయ ఒక సినిమా చేస్తోంది. ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందుతున్నట్లుగా ఈ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఒక డిఫరెంట్ కామెడీ లవ్ ట్రాక్ తో ఈ సినిమా నడుస్తుందని.. సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో శ్రీనివాస రెడ్డి మరియు చమ్మక్ చంద్ర లు కనిపించబోతున్నారు.

లేడీ లీడ్ రోల్ ను జబర్దస్త్ అనసూయ చేయబోతున్న నేపధ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపై పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు ఆదితో మరియు ఇతర టీం లీడర్లతో కామెడీ స్కిట్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా అనసూయ పెద్దగా సక్సెస్ అయింది లేదు. అందంతో నటనతో ఆకట్టుకోగల అనసూయ కామెడీ లో మాత్రం ఇప్పటి వరకు పెద్దగా మార్కులు తెచ్చుకోలేక పోయింది.

ఈసారి మాత్రం జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె కామెడీ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. ఫుల్ లెంత్ కామెడీ పాత్రలో అనసూయ కనిపించబోతుంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ అంటూ సమాచారం అందుతోంది.

అనసూయ మరియు లీడ్ పేర్‌ మధ్య జరిగే కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అనసూయ నటించబోతున్న ఈ సినిమా ఏ పాటి సక్సెస్ ని దక్కించుకొని తెచ్చిపెడుతుంది అనేది చూడాలి.