Begin typing your search above and press return to search.

ఇంత మంది సపోర్టా.. వామ్మో: అనసూయ

By:  Tupaki Desk   |   10 May 2023 1:19 PM GMT
ఇంత మంది సపోర్టా.. వామ్మో: అనసూయ
X
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన పేరు ముందు The అని పెట్టుకోవడం పెద్ద చర్చకే దారి తీస్తోంది. సోషల్ మీడియా వేధికగా ఒకరు అది కరెక్ట్ అనడం, ఈ విషయం తెరపైకి తెచ్చిన యాంకర్ అనసూయపై ఫైర్ అవడం వంటివి చాలానే చూశాం. కొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తుండగా.. చాలా మంది ఆమెకు నెగటివ్ గా రిప్లై ఇస్తున్నారు. కొంత మంది అయితే ఇష్టం వచ్చినట్లుగా తిడుతుండగా.. మరికొంత మంది పొలైట్ గానే ఇలా చేయడం తప్పంటున్నారు.

టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు కూడా ఈమెపై కోపంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తమదైన స్టైల్ లో రౌడీ బాయ్ కు హ్యాపీ బర్త్ డే చెబుతూనే.. అనసూయపై ఫైర్ అయ్యారు. అయితే ఈ విషయంలో అనసూయ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. తనను తిడుతూ పోస్టులు పెడుతున్న వాటిని స్క్రీన్ షాట్లు తీసి వాటితో రివర్స్ కౌంటర్లు వేస్తుంది. అయితే ఈ విషయంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించకపోవడం గమనార్హం. ఆయన స్పందిచకపోవడమే బెటర్ అని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఇక్కడితోనే ఇదంతా ఆగిపోతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే రౌడీ బాయ్ కు మద్దతు ఇచ్చే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. నిన్నటికి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా విజయ్ కు బర్త్ డే విషెస్ చెబుతూనే.. The అని పదే పదే చెబుతూ నాలుగు లైన్ల మ్యాటర్ రాసుకొచ్చాడు. అలాగే విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన తాజా చిత్రం బేబీ సాంగ్ రిలీజ్ కు కూడా... అందరి పేర్ల ముందు The అని పెట్టి స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చారు.

ఇంతమంది ఇంత ఘాటుగా స్పందిస్తున్నా అనసూయ ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అయితే తాజాగా అనసూయ.. ఇంత మంది మద్దతు ఇచ్చేందుకు వస్తున్నారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరో ట్వీట్ చేసింది. దీనిపై కూడా నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. అభ్యంతరం అనిపించిన వాటికి స్పందిస్తే అంతా సపోర్ట్ చేస్తారు కానీ... ఇలా అయిన దానికీ కాని దానికి స్పందిస్తే.. బాగుండదని చెబుతున్నారు.

The అనే ఒక ట్యాగ్ గురించి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ హితవు పలుకుతున్నారు. అయితే విజయ్ కు, అనసూయ భర్తకు ఆ మధ్య ఓ ఫంక్షన్ లో గొడవ జరిగిందని... దాని వల్ల హర్ట్ అయిన అనసూయ ఈ రేంజ్ లో అతడిపై విరుచుకు పడుతోందని మరికొంత మంది చెబుతున్నారు. అసలేం జరిగిందో ఆ ముగ్గురికే తెలియాలి. అయినా ఏదనా ఉంటే నేరుగా తేల్చుకోవాలే కానీ ఇలా చేయకూడదని.. నెట్టింట రచ్చ అవసరం లేదని మరికొంత మంది వాదిస్తున్నారు.