Begin typing your search above and press return to search.

ఆమె థైషోపై వెట‌కారం! దిమ్మ‌తిరిగే ట్రీటిచ్చారుగా!!

By:  Tupaki Desk   |   17 Sep 2020 10:50 AM GMT
ఆమె థైషోపై వెట‌కారం! దిమ్మ‌తిరిగే ట్రీటిచ్చారుగా!!
X
``ఆశ్చ‌ర్యం..! స్త్రీల‌కు కాళ్లున్నాయిట‌!!.. ఇదేంటీ కాళ్లు వుండవా? ప‌్ర‌స్తుతం దీనిపైనే సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. #womenhavelegs హ్యాష్ ‌ట్యాగ్ తో ప‌లువురు సినీతార‌లు కాళ్లు క‌నిపించేలా పోస్ట్ లు పెడుతుంటే అది కాస్తా ఇన్ ‌స్టాలో ర‌చ్చవుతోంది. త‌మిళ న‌టి అన‌శ్వ‌ర రాజ‌న్ కొన్ని రోజుల క్రితం షార్ట్ డ్రెస్ ధ‌రించిన ఓ ఫొటో ని ఇన్ ‌స్టా లో షేర్ చేయ‌గా.. ఈ పోస్ట్‌ని త‌ప్పు ప‌ట్టిన కొంత మంది ఐ‌‌శ్వర్య ‌రాజ‌న్ ‌ని ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

దీంతో త‌న‌కు సాటి నాయిక‌ల నుంచి మ‌ద్ధ‌తు మొద‌లైంది. కొంద‌రు సెల‌బ్రిటీలు నాయిక‌లు వ‌రుస పోస్ట్ లతో త‌న‌కు అండ‌గా నిలిచారు. న‌టి రిమా క‌ల్లింగ‌ల్ స్విమ్ సూట్ ధ‌రించి స‌ముద్రం ఒడ్డున హోయ‌లు పోతుతూ త‌న లెగ్స్ చూపిస్తున్న ఫొటోని షేర్ చే‌సింది. దీనికి ``ఆశ్చ‌ర్యం.. ఆశ్చ‌ర్యం!!! స్త్రీల‌కు కాళ్లున్నాయి!`` అంటూ వ్యాఖ్య‌ను జోడించారు. ఆ ర‌కంగా మ‌హిళ‌లు థైస్ క‌నిపించేలా డ్రెస్ లు వేయ‌కూడ‌దంటూ కొంత మంది చేసిన కామెంట్స్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఈ టాపిక్ పై మ‌రోన‌టి అహ‌నా శెట్టి తీవ్ర స్థాయిలో స్పందించింది. కేవ‌లం ష‌ర్ట్ మాత్ర‌మే ధ‌రించి ఆ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా ఈ ఫొటోని ఎవ‌రు కామెంట్ చేస్తారో చేయండి చూస్తాన‌ని స‌వాల్ విసిరింది.

ఈ పితృస్వామ్య భావ‌జాలాన్ని తీసుకెళ్లి మీ ద‌గ్గ‌ర‌లో వున్న చెత్త బుట్ట‌లో ప‌డేయండి అంది. మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ త‌న భార్య న‌జ్రియ న‌జీమ్ పొట్టిగౌనుతో వున్న ఫొటోను షేర్ చేసి #womenhavelegs అని కామెంట్ పెట్టాడు. దీనికి చాలా మంది నుంచి పాజిటివ్ స్పంద‌న వ‌చ్చింది.