Begin typing your search above and press return to search.
అనసూయ ఆవేదన విన్నారా?
By: Tupaki Desk | 26 Jan 2018 4:59 PM GMTజబర్దస్త్ షోతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో మెయింటేన్ చేసుకుంటూ వెళుతోంది. అయితే ఆ మధ్యలో అనసూయ అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆమె పై నెగిటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. ఆ తరువాత మళ్లీ కూల్ అయ్యారు అనుకోండి. కానీ అనసూయ మాత్రం ఇప్పుడు తనకు కొంత మంది వేధిస్తున్నారని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంది.
అంతే కాకూండా పెద్ద నోటిస్ ద్వారా ఇండియాకు ఒక మెసేజ్ ఇచ్చింది. అందులో ఏముందంటే.. డియర్ ఇండియా..ఓ కూతురిగా సోదరిగా మహిళగా భార్యగా కోడలిగా తల్లిగా నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నా. నేను చేసే ప్రతి పని - వేసుకునే దుస్తులు నా ఫ్యామిలీపై ఏ ప్రభావం చూపడం లేదు. కానీ వేరేవాళ్లు వీటి గురించి మాత్రం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నా ఫ్యామిలీని నన్ను కించపరిచే రైట్ వారికి ఎక్కడిది? ప్రతి రోజూ ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో కూడా అలాంటి కామెంట్లు చేస్తున్నారు. నేను ఈ గణతంత్ర దినోత్సవం నాడు బాధ్యతగల మహిళగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నచ్చిన పనిని నేను స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. ఆకతాయిలు సంప్రదాయం - సంస్కృతి అంటూ నా ఇష్టాల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ నేను అంటుంటే నేను ఎలా జీవించాను. ఇలానే బతకాల్సిందేనా? ఈ తరహా ధోరణిని ఏమీ చేయలేమా? అంటూ.. అనసూయ స్వేచ్ఛ అంటే ఇదేనా?’ అని ప్రశ్నించింది.