Begin typing your search above and press return to search.
కోట అన్నది ఒకటే కానీ.. అనసూయ ఏంటిలా!
By: Tupaki Desk | 19 Oct 2021 5:30 AM GMTయాంకర్ కం నటి అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. ముఖ్యంగా అనసూయ వస్త్రధారణపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు వేడెక్కిస్తూనే ఉంటాయి. మొదట్లో ఆకతాయిల కామెంట్లను సీరియస్ గా తీసుకున్న యాంకరమ్మ తర్వాత వాటిని లైట్ తీసుకోవడం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో సోషల్ మీడియా నుంచి తప్పుకోవడం చర్చకు వచ్చింది. కానీ సోషల్ మీడియా ఫాలోవర్స్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసుకుని మళ్లీ అదే మీడియాలోకి కంబ్యాక్ అయిన సంగతి విధితమే. అయితే ఈసారి తన గురించి కామెంట్లు వచ్చినా పాజిటివ్ గా తీసుకోవడం ప్రారంభించడం కొసమెరుపు. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనయయ వస్త్రాలంకరణపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
``అనసూయ మంచి నటి.. వ్యాఖ్యాత .. కానీ ఆమె వేసుకునే బట్టలే అభ్యంతరకరంగా ఉంటాయి. అలాంటి బట్టలు వేసుకోకపోయినా అనసూయని చూస్తారని..ఆమె చాలా అందంగా ఉంటుంద``ని కోట వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు అనసూయ చెవిన పడడంతో కోటతో పాటు అందరిపైనా ఎటాక్ చేసారు. ``ఎవరికిష్టమొచ్చిన బట్టలు వారు వేసుకుంటారు. అది వారి వ్యక్తిగత విషయం`` అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ..నేను వేసుకునే బట్టల గురించి ఓ సీనియర్ నటుడు కామెంట్లని ఇప్పుడే చూసా. నటుడిగా ఎంతో అనుభవం ఉన్న ఆయన ఇలా మాట్లాడటం బాధ కలిగించింది. ఒక్కో సారి వృత్తిపరంగా అలాంటి బట్టలు వేసుకోక తప్పదు. దాన్ని సోషల్ మీడియా కూడా అదే రేంజులో హైలైట్ చేస్తుంది. దానికి బాధ్యురాలిని నేనేనా? అదే మీడియా.. మన హీరోలు చొక్కాలు విప్పి కండలు చూపిస్తే పట్టించుకోద. దాని మీద ఎందుకు ట్రోల్ చేయరు. ఆ సీనియర్ హీరో మందు కొడతాడు. చినిగిన బట్టలు తొడుక్కుంటారు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారు అని చెప్పకపోవడం ఆశ్చర్యకరం. పెళ్లైనా హీరోలు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాటిని ఎందుకు ప్రశ్నించరు? ``అని అనసూయ మండిపడ్డారు. మొత్తానికి కోట వ్యాఖ్యల ఆసరాగా అనసూయ అందరిపైనా విరుచుకుపడినట్టయ్యింది. ప్రస్తుతం అయసూయ పలు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బుల్లి తెరపైనా సక్సెస్ ఫుల్ యాంకర్ గా దూసుకుపోతున్నారు. ఐటమ్ గాళ్ అని పిలిచినా ఒప్పుకోని అనసూయ స్పెషల్ గాళ్ అని పిలవాలని ఇంతకుముందు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తగ్గేదేలే అంటూ కెరీర్ దూకుడు..!
యాంకర్ స్టాయి నుంచి హోస్ట్ గా.. ఆ తరువాత ప్రాధాన్యత వున్న నటిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది అనసూయ. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన ఈ అమ్మడు నాగ్ నటించిన `సోగ్గాడే చిన్ని నాయనా` చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. చెక్కరకేళి చిన్నోడే.. అంటూ హోయలు పోతూ నాగ్ తో అనసూయ వేసిన స్టెప్పులు ఆమెకు మంచి గుర్తింపుని అందించడంతో పాటు వరుస క్రేజీ ఆఫర్లని తెచ్చిపెట్టింది. `రంగస్థలం`లో నటించిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయని నటిగా మరో లెవెల్ కి తీసుకెళ్లింది. విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవాలన్నది అనసూయ కోరిక. అందుకు తగ్గట్టుగానే నటనకు ప్రాధాన్యత వున్న పాత్రల్నే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా పుష్పలో అనసూయ అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ లో అనసూయ టీవీ ఛానెల్ హెడ్ గా కనిపించనుంది. రవితేజ `ఖిలాడీ`, .. కృష్ణవంశీ `రంగమార్తాండ`లో కూడా ఆమెను విభిన్న అవతారంలో కనిపించనుంది. తాజాగా అనసూయ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. దర్శకుడు సంపత్ నంది ఓ కొత్త దర్శకుడితో ఈ మూవీని నిర్మించబోతున్నారు.