Begin typing your search above and press return to search.

చివరి వార్నింగ్‌ ఇప్పటికైనా వాటిని డిలీట్‌ చేయండి

By:  Tupaki Desk   |   12 Feb 2020 6:45 AM GMT
చివరి వార్నింగ్‌ ఇప్పటికైనా వాటిని డిలీట్‌ చేయండి
X
సెలబ్రెటీలపై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేయడం అనేది చాలా కామన్‌ అయ్యింది. వారి దృష్టిని ఆకర్షించేందుకు వారిని ఆకాశానికి ఎత్తుతు కొందరు కామెంట్స్‌ చేస్తూ వారు ఏ పని చేసినా విమర్శలు చేస్తూ బూతులు తిడుతూ కొందరు కామెంట్స్‌ పెడుతూ ఉంటారు. ఇంకొందరు తమ పాపులారిటీ పెంచుకునేందుకు అదే పనిగా సెలబ్రెటీలపై బూతు జోకులు వేస్తూ.. వారి వ్యక్తిగత జీవితంపై అసభ్య కామెంట్స్‌ పెడుతూ ఉంటారు. తాజాగా తనపై అసభ్య కామెంట్స్‌ పెడుతున్న వారిపై హాట్‌ జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సీరియస్‌ అయ్యింది.

చాలా కాలంగా అనసూయపై సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే అనసూయ వాటిపై అప్పుడప్పుడు స్పందిస్తూనే ఉంది. కాని ఇప్పుడు వాటిని చాలా సీరియస్‌ గా తీసుకుంది. తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసి బూతులు పోస్ట్‌ చేసిన వ్యక్తికి సంబంధించిన ట్విట్టర్‌ అకౌంట్‌ స్క్రీన్‌ షాట్‌ తో ఇచ్చి సహా సైబర్‌ క్రైమ్‌ వారికి ఫిర్యాదు చేసింది. ట్విట్టర్‌ లో ఇలాంటి అసభ్యకర పోస్ట్‌ లు పెడుతున్నారంటూ ట్విట్టర్‌ వారికి కూడా ఫిర్యాదు చేసింది.

ఇక చివరగా లైవ్‌ వీడియోలో అనసూయ తనపై అసభ్యంగా కామెంట్స్‌ చేస్తూ.. పోస్ట్‌ లు పెడుతున్న వారికి వార్నింగ్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు వారి జీవితాలు ఎందుకు నాశనం చేయడం అనుకున్నాను. నేను సైలెంట్‌ గా ఉంటే నన్ను ఇంకా ఎక్కువగా కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే ఇకపై ఊరుకునేది లేదు. కొందరికి శిక్ష పడితే మరి కొందరు జాగ్రత్త గా ఉంటారు. అందుకే ఫిర్యాదు చేసినట్లు గా చెప్పుకొచ్చింది.

గతంలో తనపై అసభ్య కామెంట్స్‌ చేసిన వారు.. పోస్ట్‌ లు చేసిన వారు వాటిని ఇప్పటికైనా డిలీట్‌ చేయండి. లేదంటే అందరు కూడా తాను ఇచ్చిన కేసు కారణంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని అనసూయ వార్నింగ్‌ ఇచ్చింది. అనసూయ తాజా వార్నింగ్‌ తో ఆమె పై అసభ్యకరమైన పోస్ట్‌ లు తగ్గుతాయేమో చూడాలి.