Begin typing your search above and press return to search.

ఒకే యాంకరమ్మ.. రెండు కలర్‌ఫుల్‌ ఫ్రేములు

By:  Tupaki Desk   |   3 Sept 2015 12:53 PM IST
ఒకే యాంకరమ్మ.. రెండు కలర్‌ఫుల్‌ ఫ్రేములు
X
బుల్లితెర రారాణి వెండితెర వైపు వస్తోంది. టీవీక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ అమ్మడు ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ పై అందాలు విరజిమ్మబోతోంది. అందులో ఒకటి క్యూట్‌ అప్పియరెన్స్‌, మరొకటి పవర్‌ ఫుల్‌ కంటెంట్‌ ఉన్న హాట్‌ అప్పియరెన్స్‌. ఇవి రెండూ తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం అని అంటున్నారు. డీటెయిల్స్‌ లో కెళితే..

యాంకర్‌ అనసూయ జబర్ధస్త్‌, పట్టుకుంటే పట్టుచీర, జబ్‌ వియ్‌ నెట్‌ (టీవీ 9 లేటెస్ట్‌) వంటి షోలతో పాపులారిటీ పెంచుకుని వెలిగిపోతోంది. ఈ భామ ఇటీవలే రెండు పడవల పయనం ప్రారంభించింది. ఓవైపు బుల్లి తెరపై ఫ్రీలాన్స్‌ యాంకర్‌ గా హవా సాగిస్తూనే, మరోవైపు వెండితెర నాయిక గా వెలుగులు విరజిమ్మడానికి రెడీ అవుతోంది.

నాగార్జున సోగ్డాడే చిన్నినాయనా చిత్రంలో అతడికి మేనకోడలు పాత్రలో నటిస్తోంది. సేమ్‌ టైమ్‌ 'క్షణం' సినిమాలో ఓ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలో హాట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వబోతోంది. రెండు డిఫరెంట్‌ సినిమాలు.. డిఫరెంట్‌ ఫ్రేముల్లో ఒకేసారి నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ సర్కిల్స్‌ లో ఇదే హాట్‌ టాపిక్‌. అనసూయ 2016ని ఆక్రమించేట్టే కనిపిస్తోందని చెబుతన్నారంతా.