Begin typing your search above and press return to search.

అనంతలో అనసూయకు యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   3 May 2017 11:06 PM IST
అనంతలో అనసూయకు యాక్సిడెంట్
X
బుల్లితెరపై అందాలు ఆరబోసి.. వెండితెరను తెగ వేడెక్కించేస్తున్న అనసూయ ఇప్పుడు మంచి స్పీడ్ మీదే ఉంది. కెరీర్ లో కొత్త కేరక్టర్లతో దూసుకుపోతున్న ఈ భామ.. అనేక ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఫంక్షన్ కు అటెండ్ అయిన అనసూయ ప్రమాదానికి గురైంది.

బెంగళూరులో ఓ కార్యక్రమానిక అటెండ్ అయిన అనసూయ.. అక్కడి నుంచి తన ఆడికారులో తిరిగి హైద్రాబాద్ కు బయల్దేరింది. అయితే.. అనంతపూర్ జిల్లాలో ఈమె కారుకు ప్రమాదానికి గురైందన్న వార్త ఇప్పుడు సంచలనం అయిపోయింది. సీమ జిల్లాలోకి వచ్చాక.. పెనుగొండ ప్రాంతంలో అనసూయ ప్రయాణిస్తున్న కారుతో.. ఎదురుగుండా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అనసూయ ఆడి కారుతో పాటు.. ఆమెకు కూడా కొన్ని దెబ్బలు తగిలాయి. దీంతో అనంతపూర్ లోని ఓ ఆస్పత్రికి వెంటనే అనసూయను తరలించి.. చికిత్స అందించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం నుంచి తిరిగి ఓ ట్యాక్సీలో హైద్రాబాద్ కు బయల్దేరింది అనసూయ. ఈ సంఘటనలో అనసూయ కారు బాగానే డ్యామేజ్ అయిందని తెలుస్తోంది. అయితే.. భద్రతా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న లగ్జరీ కార్ కావడంతోనే.. అనసూయకు పెద్దగా దెబ్బలు తగల్లేదని అంటున్నారు.