Begin typing your search above and press return to search.

ఆంటీ అంటే మాత్రం ఊరుకోను - అనసూయ

By:  Tupaki Desk   |   26 Nov 2017 5:52 PM GMT
ఆంటీ అంటే మాత్రం ఊరుకోను - అనసూయ
X
హాట్ యాంకరమ్మ అనసూయ అమ్మాయా? ఆంటీయా? ఈ ప్రశ్నకు సమాధానం మీరేం చెబుతారో కానీ, అనసూయ మాత్రం దీనిపై ఫుల్లు క్లారిటీ ఇచ్చేసింది. మీసాలు, గెడ్డాలు ఉన్నవారు తనను ఆంటీ అనొద్దని చెప్పేసింది. అవును... రీసెంటు ఓ ఫేస్ బుక్ లైవ్ ప్రోగ్రాం సందర్భంగా నెటిజన్ ఒకరు ఆమెను ‘హాయ్ అను ఆంటీ’ అని సంబోధించాడు. దీంతో అమ్మడికి కోపం నషాలానికంటింది. నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అంటే పడతాను కానీ, మీసాలు, గెడ్డాలు వచ్చి అంకుల్స్‌లా మారినవారు కూడా ఆంటీ అంటే మాత్రం ఊరుకోనని స్ట్రాంగ్ కౌంటరేసింది.

మరో నెటిజన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అనసూయా.. నన్ను రెండో పెళ్లి చేసుకో అని అడిగాడు. అందుకు ఆమె సమాధానమిస్తూ అస్సలు చేసుకోనని చెప్పేసింది. ఎన్ని జన్మలెత్తినా తన ప్రస్తుత భర్తనే మళ్లీ పెళ్లాడతానని కుండబద్దలు కొట్టి చెప్పింది.

అలాగే తాను యాంకరింగ్ చేసే జబర్దస్త్ ప్రోగ్రాంను, అందులోని నటులను వెనకేసుకొచ్చింది. బుల్లితెర బాహుబలి జబర్దస్త్ అంటూ అనసూయ ఆ షో గురించి తెగ బిల్డప్ ఇచ్చింది. ఈ షో తెలుగు టీవీ రంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లిందని అనసూయ ఆంటీ చెప్పుకొచ్చింది.

కాగా ఇటీవల జబర్దస్త్ నటుడు ఆది అనాథల గురించి చేసిన కామెంట్లపై ఆమె మాట్లాడుతూ ఆదిని వెనకేసుకొచ్చింది. ఆ కామెంట్లను సమర్థించనప్పటికీ, ఏదో సరదా కోసం అన్నవి లైట్ తీస్కోండి అంటూ సర్దిచెప్పబోయింది.