Begin typing your search above and press return to search.
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేస్తుంది: యాంకర్ అనసూయ
By: Tupaki Desk | 3 Jun 2020 9:52 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది అనసూయ. ఆమె యాంకరింగ్ తో పాటు యాక్టింగ్ కూడా బాగా చేస్తుందని అందరికి తెలిసిందే. అయితే టీవీ ప్రేక్షకులకు యాంకర్ గా దగ్గరైన అనసూయ.. రంగస్థలం సినిమాతో సినీ ప్రియులకు కూడా దగ్గరైంది. పెళ్లి అయినా సరే గ్లామర్ డోస్ మాత్రం తగ్గించట్లేదు అనసూయ. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టీవ్ గా కనిపిస్తుంది. కరోనా పై.. సామాజిక అంశాలపై స్పందిస్తుంది. తాజాగా ఓ సంఘటన అనసూయను బాగా కలచివేసిందట. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఆ సంఘటన పట్ల తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక అసలు విషయం ఏంటంటే.. కేరళ రాష్ట్రములోని అడవిలో గర్భంతో ఉన్న ఒక ఏనుగు ఆకలికి తట్టుకోలేక జనాలు సంచరించే చోటుకి ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చిందట.
అయితే ఆ ఏనుగు ఆకలితో ఉందని తెలుసుకున్న స్థానికులు.. ఆ ఏనుగుకు పైనాపిల్ ఇచ్చారట. అది నిదానంగా పైనాపిల్ తింటూ ఒక్కసారిగా గాండ్రించింది. అందుకు కారణం ఆ పండులో స్థానికులు టపాకాయలు పెట్టి ఇచ్చారట. ఆ టపాకాయలు ఏనుగు నోటిలో పేలి.. ఏనుగు తీవ్రంగా గాయపడిందట. అప్పుడు ఆ ఏనుగు ఆ గాయాన్ని తట్టుకోలేక నీళ్ల కోసం దగ్గరలోని నదికి వెళ్లి నీళ్లు తాగుతూ.. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించిన కథనాన్ని షేర్ చేస్తూ యాంకర్ అనసూయ ఏనుగు మరణానికి కారణమైన వారిపై తీవ్రంగా మండిపడింది. అంతేగాక "మనం మరణానికి దగ్గరలో ఉన్నాం. మానవజాతి అనేదే ఒక చెత్త. మన జీవితం మొత్తం తప్పుగానే నడుస్తున్నాం. అడవి అనేది దైవంతో సమానం. ఆ నాగరికత దెయ్యం లాంటిది. అసలు ఆ సంఘటన తెలియగానే ఎంతో వేదనకు గురయ్యాను. ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేయగలుగుతున్నారు.." అంటూ ట్విట్టర్లో తన ఆవేదనను ట్వీట్ చేసింది.