Begin typing your search above and press return to search.

మొగుడితో కలిసి అనసూయ రచ్చ

By:  Tupaki Desk   |   14 Dec 2016 5:37 AM GMT
మొగుడితో కలిసి అనసూయ రచ్చ
X
సాధారణంగా పెళ్ళయిన విషయాన్ని బయట పెట్టడానికి హీరోయిన్లు సైతం భయపడుతుంటారు. స్టార్ హీరోయిన్లకు కూడా వాళ్లకు పెళ్లి జరిగిపోయిందని ఎప్పటికో కూడా చెప్పే అలవాటు చాలామందికి ఉండదు. ఇప్పుడిప్పుడు ఒకరిద్దరు మారుతున్నారు కానీ.. చాలామంది ఈ బాపతే. టాలీవుడ్ లోనే ఈ ట్రెండ్ బాగా ఎక్కువ. పెళ్లి అయిందనో.. కనీసం కుదిరిందనో చెబితే.. ఇక ఛాన్సులు రావని వారి భయం.

కానీ హాట్ యాంకర్ అనసూయ మాత్రం.. ఎవ్రీథింగ్ డిఫరెంట్ అంతే. ఏకంగా కాళ్ళకు మెట్టెలు పెట్టుకుని మరీ ఫంక్షన్లకు హాజరయిపోయి.. ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఛానల్ లో ప్రసారమయ్యే డ్యాన్సింగ్ షోకి అయితే.. తన భర్త సుశాంక్ భరద్వాజ్ తో కలిసి వచ్చేసింది. అక్కడ ఇద్దరూ కలసి డ్యాన్సులు వేయడాలు.. బుగ్గలు పిండుకోవడాలు.. ప్రపోజ్ చేసుకోవడాలు.. కౌగిలించుకోవడం.. చిన్న చిన్న ముద్దులు పెట్టేసుకోవడం.. అబ్బో వీరిద్దరి లవ్ ని ఓ రేంజ్ లో చూపించేశారులే.

తనకు పెళ్లి అయిందనే సంగతిని దాచుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించని డేరింగ్ మెంటాలిటీ ఆమెది. అలాంటి ఈ హాట్ షాట్ యాకంర్ ఏకంగా మొగుడితో బయటకే వచ్చేసి అందరికీ పెద్ద షాక్ నే ఇచ్చింది.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/