Begin typing your search above and press return to search.

మెగా హీరోల‌కు లక్కీ ఛామ్ గా మారిన యాంక‌ర్ కం న‌టి

By:  Tupaki Desk   |   24 Aug 2021 11:00 PM IST
మెగా హీరోల‌కు లక్కీ ఛామ్ గా మారిన యాంక‌ర్ కం న‌టి
X
రంగస్థలంలో రంగమ్మత పాత్రలో మెరుపులు మెరిపించింది యాంక‌ర్ కం నటి అన‌సూయ‌. కీలక పాత్రలో అద్భుత అభిన‌యంతో కుర్ర‌కారు మ‌న‌సులు దోచింది. అన‌సూయ‌ ప్ర‌శంస‌ల‌తో పాటు అవార్డులు రివార్డులు గెలుచుకుంది. అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `పుష్ప`లోనూ అన‌సూయ‌ కీలక పాత్రను పోషిస్తోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కాన్పెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ రోల్ మాస్ కి స్పెష‌ల్ ట్రీటివ్వ‌నుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ `గాడ్ ఫాదర్‌` చిత్రానికి అన‌సూయ‌ సంతకం చేసింది.

తాజా స‌మాచారం మేర‌కు మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్‌`లో అనసూయ కీలక పాత్ర పోషించనుంది. చిరుతో చెప్పుకోద‌గ్గ రేంజులో స‌న్నివేశాల్లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఇంత‌కుముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కినా వ‌దులుకున్న అన‌సూయ ఇప్పుడు బాస్ సినిమాలో ఛాన్స్ రాగానే ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. మునుముందు ప‌వ‌న్ సినిమాలోనూ ఛాన్స్ ఖాయ‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. గాడ్ ఫాదర్ మలయాళ చిత్రం లూసిఫర్ కి రీమేక్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. థమన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టించ‌నున్నారు.

క్షణం.. రంగస్థలం.. యాత్ర లాంటి చిత్రాలలో న‌టిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అన‌సూయ కెరీర్ ప‌రంగా ఇప్పుడు బెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. వైవిధ్యం విల‌క్ష‌ణ‌త ఉన్న పాత్ర‌ల‌తో ఈ బ్యూటీ ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ర్షించింది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను పైగా చిత్రాల్లో నటిస్తోంది. ఓవైపు ర‌వితేజ ఖిలాడీలో.. కృష్ణ‌వంశీ రంగ మార్తాండ లోనూ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోంది అన‌సూయ‌. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు బుల్లితెర‌పైనా త‌న షెడ్యూల్స్ ని విడిచిపెట్ట‌డం లేదు.

షాకిస్తున్న `స్పెష‌ల్` పారితోషికం..!

అన‌సూయ కేవ‌లం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానే కాదు వీలున్న‌ప్పుడు స్పెష‌ల్ నంబ‌ర్ల‌తోనూ ఆక‌ట్టుకునేందుకు సిద్ధ‌మేన‌ని తెలుస్తోంది. ``ఐటమ్ నంబ‌ర్ కాదు.. స్పెష‌ల్ నంబ‌ర్ అని పిల‌వాల‌మ్మా..!`` అంటూ ఇంత‌కుముందు అన‌సూయ‌ క్లాస్ తీస్కున్న సంగ‌తిని యూత్ మ‌రువ‌లేరు. కార్తికేయ హీరోగా నటిస్తున్న `చావు క‌బురు చ‌ల్ల‌గా` చిత్రంలో అన‌సూయ స్పెషల్ రోల్ గురించి తెలిసిందే. ఈపాట‌లో అన‌సూయ నృత్య‌భంగిమ‌లు కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించాయి. ఐట‌మ్ నంబ‌ర్ అంటూ యూత్ తొంద‌ర‌ప‌డినా.. దానికి రంగ‌మ్మ‌త్త‌ ఎట్టిప‌రిస్థితిలో అంగీక‌రించ‌లేదు. స్పెష‌ల్ నంబ‌ర్ అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు. దీంతో ఇండ‌స్ట్రీ స‌హా అభిమానుల్లో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారింది. కేవ‌లం 3 నిమిషాల నిడివి ఉండే ఈ సాంగ్‌ కోసం 15ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకోవ‌డం కూడా హాట్ టాపిక్ అయ్యింది.

ప్ర‌స్తుతం `రంగ మార్తాండ`..`కిలాడి` చిత్రాల‌కు అన‌సూయ భారీ పారితోషికం అందుకుంటోంది. అటు తమిళంలోనూ విజయ్ సేతుపతి సినిమాలోనూ అన‌సూయ న‌టిస్తున్నారు. అక్క‌డా 30ల‌క్ష‌ల వ‌ర‌కూ పారితోషికం అందుకుంటున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక యాంక‌ర్ గానూ ఒక్కో షో కోసం అన‌సూయ భారీ మొత్తాల్ని ఛార్జ్ చేస్తోంది. జ‌బ‌ర్ధస్త్ కార్య‌క్ర‌మానికి అన‌సూయ‌కు ల‌క్ష‌ల్లో పారితోషికం ముడుతోంద‌ని స‌న్నిహితులు వెల్ల‌డించారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లోనూ ర‌క‌ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్ని పోస్ట్ చేస్తూ యాడ్ స్పేస్ లో నూ అన‌సూయ ఆదాయ మార్గాల్ని పెంచుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు వ‌స్తోంది.