Begin typing your search above and press return to search.

రూమర్: ఆ యాంకర్ కు అదిరిపోతోంది

By:  Tupaki Desk   |   10 Jun 2016 3:30 PM GMT
రూమర్: ఆ యాంకర్ కు అదిరిపోతోంది
X
రూమర్లంది ఏముందండీ.. ఖర్చులేదు కదా.. చెప్పేశారు. అని అనుకుంటారు చాలామంది. అయితే వట్టినే మంట లేకుండా పొగ ఎందుకు వచ్చేస్తుంది? ఇవేమన్నా మేఘాలా.. పొగలా కనిపించడానికి. ఇప్పుడికి ఫిలిం నగర్‌ లో బీభత్సంగా సంచరిస్తున్న ఒక రూమర్ చూద్దాం.

అతడు ఒక ఫ్యామస్ యాంకర్. అయితే ఇతగాడి పార్టనర్ గా ఒకమ్మాయి బాగా ఫేమస్. ఈ ఇద్దరికీ నిజజీవితంలో కూడా ఎఫైర్‌ ఉందని అనుకుంటారు కాని ఎవ్వరికీ తెలియని నిజం ఏంటంటే.. వీరికి వేర్వేరు వ్యక్తులతో ఎప్పుడో పెళ్ళయ్యింది. ఇదంతా ఒకెత్తయితే.. ఈ మధ్యనే ఇతగాడు వేరే యాంకరమ్మతో కలసి ఇతర ప్రోగ్రామ్ లు చేస్తున్నాడు. ఇప్పుడు చాలామంది ఇతణ్ని ఇంటర్యూలలో నువ్వు ఈ అమ్మాయి ప్రియుడివా ఆ అమ్మాయి ప్రియుడివా అని అడుగుతున్నారు. సరే దూరం నుండి చూసే జనాలే అనుకుంటుంటే.. ఇతడి స్నేహితులే.. అలా అడుగుతున్నారంట.

ఇంట్లో ఆల్రెడీ వైఫ్‌ ఉంది.. ఇప్పుడేమో బయట ఇద్దరితో లింకప్ అంటూ రూమర్లు వస్తున్నాయి. దానితో మనోడికి కొంతమంది అవకాశాలు కూడా ఇవ్వట్లేదట. పైగా ఇన్నేసి ఎఫైర్లేంటి అంటూ క్లాసులు పీకేస్తున్నారు కూడా. ఎటు చూసినా కూడా మనోడికి అదిరిపోతోంది.