Begin typing your search above and press return to search.
యాంకర్ కం నటి ప్రయోగాలేంటో
By: Tupaki Desk | 6 Aug 2019 6:34 AM GMTయాంకర్ కం నటి జాన్వీ రీఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాచారం. అయితే ఈసారి నటిగా కాదు.. ఫ్యాషన్ డిజైనర్ గా రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరం. తొలుత టీవీ షోలతో పాపులరైన జాన్వీ ఆ తర్వాత సహాయక నటిగా తెలుగు సినిమాల్లో ఛాన్సులు అందుకుంది. నటిగా కొన్నాళ్లు కొనసాగినా అటుపై పెళ్లితో కెరీర్ కి బ్రేక్ పడింది.
తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దవాడైన ఛాయాగ్రాహకుడు రసూల్ ఎల్లోర్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలు.. టీవీ షోలకు బ్రేకప్ చెప్పిన జాన్వీ తిరిగి ఇటీవల క్యారెక్టర్ నటిగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ సరైన ఛాన్సులు రాలేదు. కారణం ఏదైనా జాన్వీ ప్రస్తుతం రూటు మార్చి ఫ్యాషన్ డిజైనర్ గా రాణించే ప్రయత్నం చేస్తోందట.
అడివి శేష్ నటించిన `ఎవరు` చిత్రానికి ఫ్యాషన్ డిజైనర్ గా పని చేశారు. కొన్ని కీలక సన్నివేశాల్లో శేష్- రెజీనా పాత్రలకు ఔట్ ఫిట్స్ రూపొందించింది తనేనట. తనకు పదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఓవైపు వారసుని ఆలనాపాలనా చూస్తూనే ఇప్పుడిలా కొత్త అవతారం ఎత్తిందన్నమాట. జాన్వీ తిరిగి నటిగా రీఎంట్రీ ఇవ్వదు అన్నదేం లేదు. తనకంటూ ప్రత్యేకించి యూత్ లో ఫాలోవర్స్ ఉన్నారు. డ్యాన్స్ బేబి డ్యాన్స్ రోజుల నుంచి కొంత ఫ్యాన్ బేస్ ఉంది. సార్ అప్పుడే మనం లేచిపోతున్నామా?! అంటూ `హ్యాపీ` చిత్రంలో జాన్వీ చెప్పిన డైలాగ్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. గోపిచంద్ యజ్ఞం చిత్రంలో ముస్లిమ్ యువతిగా నటించి మెప్పించింది. మరి తన ఫ్యాన్స్ కోసం అయినా తిరిగి నటిగా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.