Begin typing your search above and press return to search.

మీడియా పై యాంకర్ కమ్ నటి సెటైర్లు..!

By:  Tupaki Desk   |   11 Oct 2021 9:30 AM GMT
మీడియా పై యాంకర్ కమ్ నటి సెటైర్లు..!
X
యాంకర్ గా, నటిగా ఝాన్సీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. యాంకర్ సుమ తో పోటాపోటీగా టెలివిజన్ షో లు చేసిన ఝాన్సీ.. భర్త తో విడిపోయిన తర్వాత సినిమాల్లోనూ నటిస్తూ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఝాన్సీ.. సమాజంలో జరిగే ఎన్నో అంశాల మీద స్పందిస్తుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు విమర్శలకు గురవుతూ ఉంటుంది. తాజాగా మీడియా అత్యుత్సాహంతో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందనే విధంగా ఝాన్సీ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

''అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండులో పురుగులు… ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి, పండును పెద్దది చేశాయి. ఎద్దు బుసలుకొడుతూ రెచ్చి పోయింది, కాకులు గోల పెంచాయి..'' అంటూ ఝాన్సీ ఓ కథలా చెప్పుకొచ్చింది. ''మైకులు పెట్టి మరీ మా మురికి గొట్టాలని జనాల ఇళ్లలోకి వదలడం మించి ముఖ్యమైన వార్తలు లేవా? సినిమా ఇంట్లో పెళ్లి అయినా, విడాకులు అయినా, ఎన్నికల అయినా లోకులకు సందడి అనుకుని హడావిడి చేస్తున్న కాకుల్లారా.. ప్రజా ప్రయోజనం అంటే ఏంటో డిక్షనరీలో చూడండి'' అని ఘాటుగా స్పందించారు.

''ఇది మీరు చూడాలనుకుంటున్నది కాదు. మీకు బలవంతంగా వాళ్ళు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. మనమందరం వాచ్ డాగ్స్ - స్కేప్ గోట్స్.. హిప్నోటిక్ కెమెరా లెన్స్ చూసినపుడు ప్రజలు తమ కంట్రోల్ కోల్పోతారు. ఈ నాన్సెన్స్ కు దూరంగా ఉండండి. వార్తలను జాగ్రత్తగా ఎంచుకోండి'' అంటూ ఝాన్సీ జాగ్రత్తలు చెబుతోంది. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో జరుగుతాయి వాటిపై మీడియా ప్రసారం చేస్తున్న కథనాలను ఉద్దేశించి సీనియర్ యాంకర్ ఈ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఇటీవల హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.. నాగ చైతన్య-చైతన్య జంట విడాకుల వ్యవహారం.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు వంటి విషయాలపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటివి దృష్టిలో పెట్టుకునే ఝాన్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని అనిపిస్తోంది.