Begin typing your search above and press return to search.

కామెంట్: అలా ఆవేశపడ్డావేంటి ప్రదీప్‌??

By:  Tupaki Desk   |   1 Jan 2018 11:53 AM GMT
కామెంట్: అలా ఆవేశపడ్డావేంటి ప్రదీప్‌??
X
ఇప్పుడు ఏ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టినా కూడా.. యాంకర్ ప్రదీప్ అడ్డంగా దొరికిపోయాడు అంటూ నానా హంగామా నడుస్తోంది. పైగా.. కేవలం 35 బిఎంసి ఉంటేనే వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ ను కోర్టుకు తీసుకెళ్ళే పోలీసులు.. ఇప్పుడు ప్రదీప్ బాడీలో ఏకంగా 174 బిఎసి ఉండడం చూసి షాకైపోయారు. దానితో అతని అరెస్ట్ అంటూ సర్వత్రా వార్తలు వస్తున్నాయి. ఇక అరెస్ట్ అవుతాడా లేదా అనే సంగతి పక్కన పెట్టేస్తే.. ఒక సెలబ్రిటీ ఇలా దొరికపోవడం వలన ఒక్కసారిగా సొసైటీ కూడా షాకైపోతోంది.

నిజానికి మందు కొట్టి కార్లు నడపకండి.. క్యాబులు బుక్ చేసుకోండి.. అంటూ హైదరాబాద్ పోలీసులు చాలా ప్రచారం చేశారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకూడదని ఫ్లై ఓవర్లు బ్లాక్ చేయడం.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ పోర్టుకు వెళ్ళే ప్రయాణీకులను తప్పిస్తే ఇతరులను బ్యాన్ చేయడం.. ఇలా చాలా చేశారు. ఊరంతా డ్రంక్ డ్రైవ్ చెక్స్ చేపట్టి.. దొరికినోళ్ళని 15 రోజులు లోపలేస్తాం అని కూడా వార్నింగులు ఇచ్చారు. ఇవన్నీ ఖాతరు చేయకుండా.. అసలు తన ఖరీదైన లగ్జరీ బిఎండబ్ల్యూ కారులో ప్రదీప్ తాగేసి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ సెలబ్రిటీలు అంతేసి మందు కొడతారా అనే పాయింట్ ఎవ్వరూ అడగట్లేదు కాని.. అసలు సెలబ్రిటీలు గవర్నమెంట్ శాఖల ఆర్డర్లను పట్టించుకోకపోతే.. సామాన్య జనం దానిని నెగెటివ్ గా తీసుకునే ప్రమాదం ఉంది కదా.

పైగా ప్రదీప్ ను అక్కడ ఆపేసి కారు పోలీసులు స్వాధీనం చేసుకున్న జస్ట్ 10 నిమిషాల గ్యాపులో.. ఒక ఖరీదైన పోర్షే కారు వచ్చి మనోడ్ని పికప్ చేసుకుంది. ఇదేదో ముందే ఆ కారులో వెళితే సరిపోయేది కదా? పైగా కోటిన్నర రూపాయల బిఎండబ్లూ కారు ఉన్నప్పుడు.. కాస్త ఓవర్ టైమ్ డబ్బులిచ్చి ఒక డ్రైవర్ ను పెట్టుకోవచ్చు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. లేదంటే చక్కగా క్యాబ్ లో వెళిపోవాల్సింది కదా.

ఇకపోతే ప్రదీప్ టివిలో ఒక స్టార్ గా ఎదిగిపోయాడు. ఏకంగా సొంతంగా తనే 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' అంటూ ఒక షో కూడా నిర్వహిస్తున్నాడు. ఆ రేంజులో ఉన్న ఒక సెలబ్రిటీ.. ఇలా తాగేసి దొరికపోయాడు అంటే.. అతని ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతుందో చూడండి. ముఖ్యంగా ప్రదీప్ కు ఫ్యామిలీస్ లో చాలా ఇమేజ్ ఉంది. అతనకంటే ఒక క్రేజ్. అలాంటి ప్రేక్షకులకు ఇప్పుడు మనోడి మీద బ్యాడ్ ఒపీనియన్ పడే ఛాన్సుంది. ఇన్నాళ్ళు ఎంతమంచి పనులు చేసినా కూడా.. ఈ ఒక్క మచ్చ మాత్రం చాలా కాలామే వేధిస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా అసలు ఆవేశపడి స్టీరింగ్ ఎందుకు చేతిలోకి తీసుకున్నావ్ ప్రదీప్?