Begin typing your search above and press return to search.
యాంకర్ ప్రదీప్ పెళ్లి ఎవరితో తెలుసా?
By: Tupaki Desk | 28 Dec 2022 12:30 PM GMTబుల్లితెర యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించిన వార్తలు గత కొంత కాలంగా వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పలు టీవీ షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తూ తనదైన మార్కు పంచ్ లతో ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తన పెళ్లిపై గత కొంత కాలంగా వరుసగా వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి వార్తే నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నాడు.
నేను కాస్త బిజీగా వుండటం వల్ల ఈ వార్తలపై స్పందించలేకపోయానని, ఇంత వరకు తనకు నిశ్చితార్ధం, పెళ్లీ ఏదీ లేదని.. నేనిప్పటికీ సింగిలేనని తెలిపాడు. అంతే కాకుండా పాపం ఎవరో డిజైనర్ తో తాను ఏడడుగులు వేయబోతున్నానంటూ రాసేశారని కానీ ఆమె ఎవరో కూడా నాకు తెలియదని స్పష్టం చేశాడు. నా టీమ్ ఆమె డిజైన్ చేసిన డ్రెస్ లని కొని వుండొచ్చేమో కానీ అనవసరంగా ఆమె పేరుని ఇందులోకి లాగకండి అన్నాడు. అంతే కాకుండా తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నాడు.
అంతే కాకుండా ఇప్పుడిప్పుడే నా కుటుంబం తండ్రి పోయిన బాధ నుంచి కోలుకుంటోందని, ప్రస్తుతం నా దృష్టంతా టీవీ షోలు, సినిమాలపైనే వుందని, నేను హీరోగా మరో సినిమా చేస్తున్నానని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాదే ఆ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం` అని తెలిపాడు. ప్రదీప్ `వరుడు`, 100% లవ్`, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా, భమ్ భోలేనాథ్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో నటించిన విషయం తెలిసిందే.
ఇక గత ఏడాదే ప్రదీప్ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా పరిచయమైంది. 2021 జనవరి 29న విడుదలైన ఈ మూవీ ప్రదీప్ కు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న ప్రదీప్ త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.