Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లు ట్రోల్స్‌ చేసిన వారు ఇప్పుడు సూపర్‌ అమ్మడు అంటున్నారు!

By:  Tupaki Desk   |   4 April 2020 9:30 PM IST
ఇన్నాళ్లు ట్రోల్స్‌ చేసిన వారు ఇప్పుడు సూపర్‌ అమ్మడు అంటున్నారు!
X
జబర్దస్త్‌ యాకంర్‌ రష్మి గౌతమ్‌ పై గతంలో పలు సార్లు నెటిజన్స్‌ ఆమె డ్రస్‌ ఇంకా వివిధ కారణాల వల్ల ట్రోల్స్‌ చేసిన విషయం తెల్సిందే. ఆమెను మానసికంగా ఎంతో మంది వేధించారు. తనను వేదిస్తున్నారు అంటూ రష్మి ఒకానొక సమయంలో సైబర్‌ క్రైమ్‌ వారి వద్దకు కూడా వెళ్లింది. అంతగా ఆమెను విసిగించిన నెటిజన్స్‌ ఇప్పుడు ఆమె దాన గుణంకు దయా హృదయంకు ఫిదా అయ్యి నువ్వు సూపర్‌ అమ్మడు.. నీది జబర్దస్త్‌ గుణం అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో కేంద్ర లాక్‌ డౌన్‌ విధించగా మనుషులు మాత్రమే కాకుండా రోడ్డున ఉండే జంతువులు కూడా ఆకలితో అలమటిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్డున ఉండే కుక్కలు ఆహారం దొరకకా తీవ్ర అవస్థలు పడుతున్నాయి. వాటి కోసం తనవంతు సాయం అన్నట్లుగా ఒక స్వచ్చంద సంస్థతో కలిసి ఫుడ్‌ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ఏదో సాయం చేశాం చేతులు దులుపుకున్నాం అని కాకుండా ఈ అమ్మడు ఏకంగా రోడ్ల మీదకు కుక్కలకు ఫుడ్‌ తో వచ్చేసింది.

పెద్ద బకిట్లలో కుక్కల కోసం ఫుడ్‌ ను తీసుకు వచ్చిన రష్మి తన వాలింటీర్లతో కలిసి కుక్కలకు డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దాంతో ఆమె మంచి మనసును అంతా అభినందిస్తున్నారు. ఆమద్య జంతువులు తిండి లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నాయి అంటూ ఏకంగా కన్నీరు పెట్టుకుంది. ఎవరికి చేతనైన సాయం వారు చేయండి అంటూ విజ్ఞప్తి చేసింది. అలాగే ఆమె కూడా స్వయంగా రంగంలోకి దిగి మరీ కుక్కలకు ఆహారంను పెట్టింది.