Begin typing your search above and press return to search.

అమ్మాయిలను అలా అడగటానికి సిగ్గు లేదా : రష్మి

By:  Tupaki Desk   |   10 Aug 2019 5:35 AM GMT
అమ్మాయిలను అలా అడగటానికి సిగ్గు లేదా : రష్మి
X
బుల్లి తెర మరియు వెండి తెరలపై తనదైన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్న జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేదింపులు మరియు ఇతరత్ర సమస్యల గురించి తరచుగా స్పందించే రష్మి మరోసారి సోషల్‌ మీడియాలో ఆకతాయిలపై విరుచుకు పడింది. తాజాగా తన ఫాలోవర్స్‌ తో వీడియో చాట్‌ చేసిన రష్మి హద్దులు దాటి కామెంట్‌ చేసే వారిపై చాలా సీరియస్‌ గా రియాక్ట్‌ అయ్యింది.

చాలా ఫీవర్‌ గా ఉందని నా మొహం కూడా సరిగా లేదని అందుకే వీడియో ఫిల్టర్‌ యూజ్‌ చేస్తున్నట్లుగా చెప్పింది. అనారోగ్యంతో ఉన్న ఈమె అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. ఈ సందర్బంగా పిచ్చి రాతలు రాస్తూ.. పిచ్చి కామెంట్స్‌ చేసే వారిని ఉద్దేశించి స్పందిస్తూ తాను మెచ్యూర్డ్‌ కాబట్టి అలాంటి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. అలాంటి మెసేజ్‌ లు నా జీవితంపై లేదంటే నా కెరీర్‌ పై పెద్దగా ప్రభావం చూపవు. అసలు అలాంటి వారి గురించి నేను పట్టించుకోను. అలాంటి మెసేజ్‌ లు పెట్టే వారి గురించి బయట సమాజంకు తెలిసేలా మాత్రం చేస్తాను. మరోసారి వారు అలా చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను అంది.

నేను ఒక సెలబ్రెటీని కాబట్టి నాకు మాత్రమే ఇలాంటి మెసేజ్‌ లు వస్తున్నాయని కొందరు అనుకుంటున్నారు. కాని ఇలాంటి చెత్త మెసేజ్‌ లు సామాన్యులైన అమ్మాయిలకు కూడా వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్‌ చేస్తున్నారు. వారు వాటి గురించి బాహాటంగా మాట్లాడలేక పోతున్నారు. ఉద్యోగం చేసే వారికి.. సోషల్‌ మీడియాలో ఉండే వారికి ఇలాంటి కామెంట్స్‌ చాలా కామన్‌ అయ్యాయని రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఒక నైట్‌ కు ఎంత ఇస్తే వస్తావు అంటూ అమ్మాయిలను కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయినా అమ్మాయిలు ఎందుకు వస్తారు. అలా వస్తావా అని అడగడానికి సిగ్గు లేదా. మీ కోరికలు హద్దులు దాటుతున్నాయి. మీలాంటి వారిని అమ్మాయిలు ఎందుకు పట్టించుకుంటారు. అసలు అలా ఎలా ఆలోచిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఎంతో మంది అమ్మాయిలు వేదింపులకు గురవుతున్నారు. సెక్స్‌ అనే విషయంలో అమ్మాయిలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. అమ్మాయిలను వర్జినిటీ ఎంత మందితో పోగొట్టుకున్నావని మాత్రమే అడుగుతారు. అబ్బాయిని ఆ విషయం ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ రష్మి అంది. అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు చాలవన్నట్లుగా సోషల్‌ మీడియాలో కూడా వేదింపులు ఏంటీ అంటూ రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.