Begin typing your search above and press return to search.
యాంకర్ ప్రదీప్ హెల్త్ కు ఏమైంది? అందుకే రావట్లేదా?
By: Tupaki Desk | 26 Oct 2019 9:33 AM GMTబుల్లితెర మీద యాంకర్లు అన్నంతనే సుమ.. ఝూన్సీ.. అనసూయ.. రేష్మా.. శ్రీముఖి.. లాస్య ఇలా వరుస పేర్లు గుర్తుకు వచ్చేస్తుంటాయి. మరి.. మేల్ యాంకర్లు అన్నంతనే అందరి నోట వచ్చే పేర్లలో ఒకటి ప్రదీప్. చూసేందుకు చిన్నగానే ఉన్నా.. తన టైమింగ్ తో అదరగొట్టేయటమే కాదు.. తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. అల్లరి చేస్తూ.. ఆడిపాడటమేకాదు.. తనదైన పంచ్ లతో వచ్చిన సెలబ్రిటీలనే కాదు.. తన సహ కంటెస్టెంట్లను ఆట పట్టిస్తూ హడావుడి చేస్తుంటారు.
అలాంటి ప్రదీప్ గడిచిన కొద్ది రోజులగా కనిపించటం లేదు. ఏమయ్యాడన్నది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా మారింది. అయితే.. తన రెమ్యునరేషన్ ను పెంచేయటం కారణంగా అతనికి అవకాశాలు లభించటం లేదన్న మాట వినిపించింది. అయితే.. అలాంటి వార్తల్లో నిజం లేదని.. అతనికున్న అసలు సమస్య ఏమిటో బయటపెట్టారు మరో యాంకర్ రవి.
గడిచినకొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్.. ప్రస్తుతం సాధారణ స్థితిలోకి వచ్చే దశలో ఉన్నాడని పేర్కొన్నారు. ఢీ జోడిలో ఎంట్రీ ఇచ్చిన రవి.. ప్రదీప్ లేకపోవటం గురించి.. ఆ అంశం పై సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా అసలు విషయాన్ని చెప్పేశారు. ఈ మధ్యనే (అక్టోబరు23న) తన పుట్టిన రోజును ప్రదీప్ జరుపుకున్నాడని.. ఆ సందర్భంగా యాంకర్స్ అంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నట్లు చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్.. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తున్నాడని.. త్వరలోనే గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు రవి. మరి.. ప్రదీప్ కు ఎదురైన ఆరోగ్య సమస్య ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరి.. దీనిపై ప్రదీపే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.