Begin typing your search above and press return to search.

సన్నీని చూసి యాంకర్ రవి అలా అనేశాడేంటి..

By:  Tupaki Desk   |   14 March 2017 10:46 AM GMT
సన్నీని చూసి యాంకర్ రవి అలా అనేశాడేంటి..
X
పోర్న్ స్టార్ గా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న సన్నీ లియోన్.. ఇండియాకు వస్తుందని.. ఇక్కడ బాలీవుడ్లో సినిమాలు చేస్తుందని.. తెలుగు సినిమాల్లోనూ ఆడి పాడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఆఖరికి సన్నీ ఒక టాలీవుడ్ మూవీ ఆడియో వేడుకలోనూ నృత్యం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిన్న ‘రోగ్’ సినిమా ఆడియో వేడుకలో సన్నీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా సన్నీని చూసి చాలామంది ఎగ్జైట్ అయిపోయారు. అందులో ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేసిన రవి కూడా ఒకడు. సన్నీని చూసి చాలా ఎగ్జైట్ అయిపోతూ.. ఆమెనుద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవి.

సన్నీ ముందు మోకాళ్లపై కూర్చుని.. ఆమెను ఇలా నేరుగా చూడటంతో తన జన్మధన్యం అయిపోయిందని వ్యాఖ్యానించాడు రవి. ఆమెనిలా తాను నేరుగా.. ఇంత దగ్గరగా చూస్తానని కలలో కూడా అనుకోలేదన్నాడతను. మగాళ్లందరికీ నువ్వొక ఏంజెల్ అంటూ ఆమెను ఆకాశానికెత్తేశాడు. అంతే కాదు.. తన తండ్రి కూడా సన్నీని తల్చుకుంటాడని రవి చెప్పడం విశేషం. ఇంట్లో ఎప్పుడైనా కోపం వస్తే.. ఓ సన్నీ లియోనాయనమ: అనుకుంటాడని అతను తెలిపాడు. ఈ మాటలకు సన్నీ తెగ సిగ్గుపడిపోయింది. అనంతరం మైక్ అందుకున్న సన్నీ.. ‘రోగ్’ టీంకు శుభాకాంక్షలు చెప్పింది. ‘రోగ్’ ట్రైలర్ చూశానని.. అమేజింగ్ గా ఉందని.. పూరి సినిమా చాలా బాగా తీసి ఉంటాడని భావిస్తున్నానని ఆమె తెలిపింది. ఈ వేడుకలో డ్యాన్స్ చేయడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందంటూ.. ఐ లవ్యూ గయ్స్ అని సెలవు తీసుకుంది సన్నీ.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/