Begin typing your search above and press return to search.

డ్రైవర్ ను తీసేసిన హాట్ యాంకర్

By:  Tupaki Desk   |   4 Oct 2017 5:29 AM GMT
డ్రైవర్ ను తీసేసిన హాట్ యాంకర్
X
యాంకర్ గానే హాట్ హాట్ అనిపించేసుకున్న ఆ భామ.. ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆమెకు వస్తున్న సినిమా అవకాశాలు కూడా క్రేజీవే కావడం విశేషం. భారీ చిత్రాలతోనే టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించనున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుతోందని చెబుతుంటారు.

ఈ హాట్ యాంకర్ కం యాక్టర్ కు తన హాట్ ఫోటోలను షేర్ చేయడం మహా ఇష్టమైన విషయం. కెరీర్ ను పరుగులు పెట్టించడంలో వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి.. ఆ యాంగిల్ లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ కాదు ఈ బ్యూటీ. అయితే.. రీసెంట్ గా ఈమె తన డ్రైవర్ ను ఉద్యోగంలోంచి అర్ధాంతరంగా తీసేసిందట. రెండేళ్ల నుంచి తన దగ్గర నమ్మకంగా పని చేస్తున్న వ్యక్తిని ఉన్నఫళంగా తొలగించడం వెనక సరైన కారణమే ఉందని అంటున్నారు. ఈమెను మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను తీసి తన స్నేహితులకు షేర్ చేశాడట ఆ డ్రైవర్. అది కూడా తన యజమాని పర్మిషన్ లేకుండా ఆ ఫోటోలను తీయడమే అసలైన విషయం.

ఈ యాంకర్ కూడా మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను నెట్ లో పెడుతూ ఉంటుంది కానీ.. వాటిలో కూడా లైట్ టచప్స్ ఉంటాయి. కంటి కింద ఉండే నల్లటి చారలు.. పింపుల్స్ మచ్చలు కనిపించకుండా క్రీమ్ అప్లై చేసిన తర్వాత తీసుకున్న ఫోటోలనే షేర్ చేస్తుంది. అయితే.. అవేమీ లేకుండా తన ఒరిజినల్ ఫేస్ బయటకు రావడానికి కారణం అయిన ఆ డ్రైవర్ పై కోపం తెచ్చుకున్న ఆమె.. డ్రైవర్ కు ఉద్వాసన పలికేసిందని టాక్. ఇప్పటికే కొత్త డ్రైవర్ ను అపాయింట్ చేసుకోవడమే కాదు.. స్మార్ట్ ఫోన్ వాడకూడదనే కండిషన్ పైనే చేర్చుకుందని అంటున్నారు.