Begin typing your search above and press return to search.

హాట్ యాంక‌ర్ మ‌రీ ఇంత హాట్ అయితే ఎలా?

By:  Tupaki Desk   |   10 Sep 2022 9:36 AM GMT
హాట్ యాంక‌ర్ మ‌రీ ఇంత హాట్ అయితే ఎలా?
X
శ్రీముఖి అలియాస్ రామ‌ల‌మ్మ బుల్లి తెర‌ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న తెర‌పై ఎంత కాపిటీష‌న్ ఉన్నా రాముల‌మ్మ ప్ర‌త్యేక‌త మాత్రం వేరు. యాంక‌ర్లంద‌రికంటే స‌మ్ థింగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అమ్మ‌డి సొంతం. త‌న‌లో ఆ రేర్ క్వాలిటీనే మిగ‌తా వాళ్ల నుంచి వేరు చేస్తుంది. సరైనా సినిమా ఛాన్సులు ప‌డ‌లేదు..లేదంటే అక్క‌డా అమ్మ‌డు చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగేది.

అయినా అంది వ‌చ్చిన ఏ అవ‌కాశాని విడిచిపెట్ట‌డం లేదు. త‌న లో హాట్ అప్పిరియ‌న్స్ ని సంద‌ర్భం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా పింక్ డిజైన‌ర్ లో అమ్మ‌డి హాట్ ఫోటో ఒక‌టి దుమారం రేపుతోంది. టాప్ టూ బాట‌మ్ పింక్ వ‌ర్ణంలో రాముల‌మ్మ త‌ళుకులీనింది. ఓ షోల్డ‌ర్ ని డిజైన‌ర్ లో క‌వ‌ర‌ప్ చేస్తూ మ‌రో షోల్డ‌ర్ ఫ్రీగా వ‌దిలేసింది.

బ్లౌజ్ లో అమ్మ‌డి ఎంద అందాలు మాత్రం యువ‌త‌లో అగ్గిరాజేస్తున్నాయి. చెవుల‌కి ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్.. లిప్ స్టిక్ లెస్ పెదాలు...లైట్ మ్యాక‌ప్ బ్యూటీ అంద‌న్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఫోక‌స్ చేస్తున్నాయి. గ‌తంకంటే అమ్మ‌డు బాగా స‌న్న‌బ‌డింది. చ‌బ్బీ లుక్ లో ఎక్స్ ఫోజింగ్ కాస్త అతిగా అనిపించేది. ఆ రిమార్క్ ను ఎలాగూ తొల‌గించుకుని స‌న్న‌జాజి సో య‌గంలా మారిపోయింది.

మ‌ళ్లీ మునుప‌టి క్రేజ్ ని సొంతం చేసుకుంటుంది. ఇక బుల్లి తెర‌పైనా సొగ‌స‌రి డిజైన‌ర్ దుస్తుల్లో మురుపిస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీముఖి ఏ షో చేసినా ఆ షోలో అమ్మ‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్ గా నిలుస్తుంది. కాంపిటీష‌న్ పెరుగోత‌న్న నేప‌థ్యంలో బ్యూటీ మ‌రింత అందంగా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది.

ఆ క్ర‌మంలోనే శ‌రీరం సహా రూప‌లావ‌ణ్యంలో భారీ మార్పులు తీసుకొస్తుంది. మ‌రి ఈ మార్పులు బుల్లి తెర‌కే ప‌రిమితం చేస్తుందా? పెద్ద తెర‌పైనా మెరిసే ప్లాన్ లో భాగంగా ఈ ఛెంజెస్ అన్నింటిని తీసుకొస్తుందా? అన్న‌ది తెలియాలి.

ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల‌తో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. అడ‌పా ద‌డ‌పా చిన్న చిత‌కా సినిమాల్లో మెయిన్ లీడ్స్ లో నూ క‌నిపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.