Begin typing your search above and press return to search.

బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. ఎవరంటే?

By:  Tupaki Desk   |   19 Feb 2021 9:50 AM GMT
బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. ఎవరంటే?
X
లాక్ డౌన్ ఎప్పుడైతే ముగిసిందో అప్పటినుండి సినిమాలు టీవీ షోలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఈమధ్య వరుసగా ఒక్కొక్కరు ప్రేమ, పెళ్లి విషయాలను బయటపెడుతూ షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా మెల్లగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు.

తాజాగా ఓ టీవీ సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ఎవరో కాదు పాపులర్ యాంకర్ శ్రీముఖి. ఎందుకంటే ఈ యాంకరమ్మ ఇటీవలే ఓ టీవీ షోలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. బుల్లితెర యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి త్వరలో పెళ్లి భోజనం పెట్టనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా ఇవే సందేహాలు వ్యక్తం అవుతాయి. మరి ఏ షోలో చెప్పింది అంటే..

స్టార్ మా ఛానల్లో 'స్టార్ట్ మ్యూజిక్' అనే కొత్త ఎంటర్టైన్మెంట్ షో వారానికి ఒకసారి ప్రసారం అవుతోంది. యాంకర్ సుమ వ్యాఖ్యతగా కొనసాగుతున్న ఈ షో నుండి ఈ వారం రాబోయే ప్రోగ్రాం ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఆ షోలో శ్రీముఖితో పాటు విష్ణుప్రియ, హరి, పండు మాస్టర్, ఆర్జే చైతూ, రోల్ రైడాలు అటెండ్ అయ్యారు. అయితే ఈ షోలో సుమ - శ్రీముఖిల మధ్య జరిగిన సంభాషణలో శ్రీముఖి బాయ్ ఫ్రెండ్ వ్యవహారం బయటికి వచ్చింది.

యాంకర్ సుమ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇక్కడ స్టేజిమీద కనిపిస్తున్నవారిలో ఎవరంటే అంటే ఇష్టమని అడిగింది. అందుకు సమాధానంగా తనకు చిరంజీవి అంటేనే ఇష్టమంటూ చటుక్కున చెప్పేసింది శ్రీముఖి. అలాగే ఒకవేళ రొమాంటిక్ డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తావని సుమ మరో ప్రశ్న అడిగింది. అంతే ''ఆల్రెడీ నేను కమిటెడ్.. ఇప్పుడు నేనిలా డేటింగ్‌ వెళ్తే నా బాయ్ ఫ్రెండ్ ఫీలవుతాడు. నాకంటూ కొన్ని నియమాలున్నాయి'' అంటూ అందరిముందే షాకింగ్ న్యూస్ చెప్పింది శ్రీముఖి. ఇక 'పండు కొంచెం లిమిట్స్‌లో ఉండు నువ్వు' అంటూ శ్రీముఖి ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది.