Begin typing your search above and press return to search.

అదేంటీ సుమ‌క్క అంతా తూచ్ అబ్బా అంటోంది!

By:  Tupaki Desk   |   28 Dec 2022 6:19 AM GMT
అదేంటీ సుమ‌క్క అంతా తూచ్ అబ్బా అంటోంది!
X
బుల్లితెర యాంక‌ర్ గా గ‌త ప‌దిహేనేళ్లుగా త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తోంది యాంక‌ర్ సుమ‌. పుట్టినిల్లు కేర‌ళ‌.. మెట్టినిల్లు తెలంగాణ‌. స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ కుటుంబ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన సుమ అచ్చ తెలుగు అమ్మాయికి మించి తెలుగు అన‌ర్గ‌ళంగా మాట్లాడుతూ.. పంచ్ లు వేస్తూ త‌న మార్కు కామెడీతో ప‌లు షోల‌ను ర‌క్తికట్టిస్తూ వ‌స్తోంది. త‌ను షోలో వుంటే చాలు అది సూప‌ర్ హిట్టే అనేంత‌గా పాపులారిటీని సొంతం చేసుకుని బుల్లితెర యాంక‌ర్ల‌లో సుమ‌క్క య‌మ కాస్ట్లీ గురూ అనిపించుకుంది.

తెలివిజ‌న్ రంగంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న యాంక‌ర్ గా రికార్డుని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది టెలివిజ‌న్ ఇండస్ట్రీగా నిలిచింది. త‌న‌దైన మార్కు హాస్యంతో ప‌లు టీవీ షోల‌కు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా మారిన సుమ రీసెంట్ గా ఓ టీవీ షోలో పాల్గొంది.

తాను యాంక‌రింగ్ కు బ్రేక్ ఇస్తున్నాన‌ని వెల్ల‌డించి భావోద్వేగానికి లోనైంది. ఈ సంద‌ర్భంగా ఎమోష‌న్ కు గురైన సుమ స్టేజ్ పైనే క‌న్నీళ్లు పెట్టుకుంది. నేను మ‌ల‌యాళీ అయినా తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను గుండెల్లో పెట్టుకుని ప్రేమించార‌ని తెలిపింది.

సుమ బుల్లితెర‌పై త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న సుమ ఇలా వున్న‌ట్టుండి యాంక‌రింగ్ కు బ్రేక్ ఇస్తానంటూ ఎమోష‌న్ కు ఎందుకు గుర‌యింది?.. ఇందుకు గ‌ల కార‌ణ‌మేంటీ అని అంతా ఆరాతీస్తూ ఆమె అభిమానులు షాక్ గుర‌వుతుంటే స‌ద‌రు టీవీ షోలో పాల్గొన్న సెల‌బ్రిటీలు సుమ‌కు శాలువా క‌ప్పి ప్ర‌త్యేకంగా స‌న్మానించడం ఎవ‌రికీ అర్థం కాలేదు. ఇక సుమ‌క్క యాంక‌రింగ్ చేయ‌దా? .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌లో క‌నిపించ‌దా? అని ఫ్యాన్స్ కంగారు ప‌డ్డారు.

అయితే తాజాగా బుధ‌వారం సుమ ఓ వీడియోని విడుద‌ల చేసింది. త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చేసింది. 'రీసెంట్ గా న్యూ ఇయ‌ర్ ఈవెంట్ లో పాల్గొన్నాను. అందులో నేను కాస్త ఎమోష‌న‌ల్ అయిన మాట వాస్త‌వ‌మే.

అయితే ఈవెంట్ మొత్తం చూస్తే మీకు అస‌లు విష‌యం తెలుస్తుంది. నేను టీవీ కోసం, ఎంట‌ర్ టైన్ మెంట్ కోస‌మే పుట్టా. నేను ఎక్క‌డికి వెళ్ల‌ను. కాబ‌ట్టి మీరు హ్యాపీగా వుండండి. హ్యాపీ న్యూ ఇయ‌ర్‌' అంటూ త‌న‌పై వ‌చ్చిన వార్త‌లు అంతా తూచ్ అని కొట్టి పారేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.