Begin typing your search above and press return to search.
సునీత మ్యారేజ్ కు సుమ ఖరీదైన గిఫ్ట్
By: Tupaki Desk | 12 Jan 2021 10:03 AM GMTసింగర్ సునీత వివాహం ఇటీవల రామ్ వీరపనేని తో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సునీత మరియు రామ్ ల సన్నిహితులు బంధువులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా ఈ పెళ్ల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక సునీతకు సుదీర్ఘ కాలంగా స్నేహితురాలు అయిన యాంకర్ సుమ భర్త రాజీవ్ తో కలిసి పెళ్లికి హాజరు అయ్యింది. పెళ్లి వేడుకలో సుమ చాలా సమయం సందడి చేసింది. దాదాపుగా పాతిక సంవత్సరాలుగా వీరిద్దరి మద్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎన్నో వేల కార్యక్రమాల్లో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. సుమ సునీతలు స్నేహితులు మాత్రమే కాకుండా అంతకు మించి అన్నట్లుగా వారి సన్నిహితులు అంటూ ఉంటారు.
సునీత వివాహంకు సుమ చాలా సంతోషంగా వ్యక్తం చేసింది. ఒంటరి జీవితంను గడుపుతున్న స్నేహితురాలు ఇన్నాళ్లకు అయినా తోడును వెదుక్కోవడం పట్ల సుమ ఆనందంగా ఉందట. ఇక సునీత వివాహం సందర్బంగా సుమ ఏకంగా లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను గిప్ట్ గా ఇచ్చింది. ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న సుమ డైమండ్ నెక్లెస్ ఇవ్వడం పెద్ద విషయం కాదు. కాని అత్యంత క్లోజ్ గా ఉన్న వారికి మాత్రమే అంత విలువైన బహుమానాలు ఇస్తూ ఉంటారు. అంత ఖరీదైన బహుమానంను సునీతకు సుమ ఇచ్చారు అంటే ఇద్దరి మద్య ఎంతటి సన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.