Begin typing your search above and press return to search.
యాంకర్ సుమ కనకాల క్యాన్సర్ బాధితులకు సేవలు
By: Tupaki Desk | 4 Dec 2021 3:30 AM GMTతెలుగు సినిమా టీవీ రంగంలో పని చేస్తున్న వారికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం యాంకర్ సుమ కనకాల పిలుపునిచ్చారు. `ఫెస్టివల్స్ ఫర్ జాయ్` తరపున సుమ కనకాల చొరవను ప్రదర్శిస్తున్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్-తానా సంయుక్త కార్యక్రమమిది. విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్సె- నానక్ రామ్ గూడలో 5 డిసెంబర్ 2021న మధ్యాహ్నం 3 గంటలకు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయనున్నామని ప్రకటించారు.
ఫెస్టివల్స్ ఫర్ జాయ్ బృందం మా క్రిస్మస్ ప్రచారంలో భాగంగా సినీటీవీ రంగ మహిళా సాంకేతిక నిపుణులు .. ఫిల్మ్ అండ్ టీవీ ఫెడరేషన్ లోని యూనియన్ కుటుంబ సభ్యుల కోసం క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని.. ప్రమాదకర రుగ్మతను ముందుగానే గుర్తించడం చాలా మంది జీవితాలను కుటుంబాలను రక్షించగలదని చెప్పడానికి ఆనందంగా ఉంది.
`ఫెస్టివల్స్ ఫర్ జాయ్` అనేది సుమ కనకాల తీసుకుంటున్న ఇనిషియేషన్. ప్రతి పండుగను ఆనందాన్ని పంచడానికి నిజమైన అర్థంలో పండుగను జరుపుకోవానేది మా నినాదం. ఈ చొరవ దాతల మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది. రోగ నిర్ధారణకు సహాయానికి వారిని లబ్ధిదారులతో కలుపుతుంది. చిన్న గా అయినా దేశంలోని తీవ్రమైన సామాజిక సమస్యలను పరిష్కరించడం దీని ఉద్ధేశం.. అని తెలిపారు. సుమ కనకాల బుల్లితెర యాంకర్ గా నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసినదే.