Begin typing your search above and press return to search.
బిబి4 : సుమ ఎంట్రీ.. డబుల్ ఎలిమినేషన్ రెండు డ్రామానే
By: Tupaki Desk | 9 Nov 2020 4:30 AM GMTతెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తంను కూడా ఎడిటర్స్ తమ బుజాలపై వేసుకున మోస్తున్నారు అనిపిస్తుంది. వారు కట్ చేసే ప్రోమోల వల్లే ఈ సీజన్ అంతో ఇంతో రేటింగ్ ను దక్కంచుకుంటుంది. ప్రోమోలో ఏదో జరుగబోతుంది అంటూ చూపించడంతో ప్రేక్షకులు ఎపిసోడ్ ను చూసేందుకు ఆసక్తిగా ఉంటున్నారు.
ప్రతి వారం లాగే ఈ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో కూడా ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తించింది. ఆదివారం ఉదయం వచ్చిన బిగ్ బాస్ ప్రోమోలో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది అన్నట్లుగానే చూపించారు. ఆమె వెళ్లిందనే అంతా భావంచారు. కాని ఎక్కడో ప్రోమో మాయేనేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. కాని సుమ ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆమెను చాలా మంది కోరుకుని షో చూశారు. కాని అది కూడా డ్రామానే అంటూ వెళ్లడయ్యింది.
ఆదివారం ఎపిసోడ్ లో సుమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె టైమింగ్ కామెడీ పంచ్ లతో నాగార్జున.. ప్రేక్షకులు.. కంటెస్టెంట్స్ ఇలా అంతా కూడా తెగ నవ్వేసుకున్నారు. ఎపిసోడ్ ఆరంభంలో ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇచ్చి అందులో విన్నర్ అయిన వారికి దీపావళి గిప్ట్ లను ఇచ్చారు. ఇంటి సభ్యులు ఒకరి కోసం ఒకరు గిప్ట్ లు పంపించుకున్నారు. అందరికి గిప్ట్ లు వచ్చాయి కాని అమ్మ రాజశేఖర్ మరియు మోనాల్ లకు మాత్రం ఇంటి సభ్యులు ఎవరు కూడా గిప్ట్ లు అడగలేదు. దాంతో వారిద్దరిని నేను ఇస్తాను అంటూ నాగార్జున చెప్పాడు.
ఒక్కరు ఒక్కరు చొప్పున సేవ్ అవ్వగా చివరకు అమ్మ రాజశేఖర్ మరియు అవినాష్ లు మిగిలి పోయారు. వారిద్దరు కూడా బయటకు వెళ్లడంతో డబుల్ ఎలిమినేషన్ అంటూ కొంత సమయం డ్రామా సాగింది. వారిద్దరు వెళ్లడంతో అరియానా కన్నీటి పర్యంతం అయ్యింది. కొంత సమయం తర్వాత అవినాష్ స్టోర్ రూం నుండి బయటకు వచ్చాడు. బయటకు తీసుకు వెళ్లినప్పుడు ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది అంటూ అవినాష్ కన్నీరు పెట్టుకున్నాడు.
బయటకు వెళ్తే నేను మళ్లీ జీరో నుండి మొదలు అవ్వాల్సి వస్తుందని ఆ విషయం తల్చుకుని చాలా ఏడ్చాడు. మొత్తానికి బిగ్ బాస్ 9 వారాలు ముగిసి 10వ వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 10 మంది బయటకు వెళ్లి పోయారు. పది మందిలో ఇద్దరు గంగవ్వ మరియు నోయల్ లు ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండా అనారోగ్య కారణాల వల్ల ఎలిమినేట్ అయ్యారు.