Begin typing your search above and press return to search.
హౌ విల్ యూ సాటిస్ ఫై మై బాస్? అని అడిగారు!
By: Tupaki Desk | 9 July 2019 12:50 PM GMTస్టార్ మాలో `బిగ్ బాస్ సీజన్ 3` ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే పార్టిసిపెంట్స్ జాబితా రివీలైంది. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది.
ఈ షోలో పాల్గొనేందుకు ఆడిషన్స్ చేసి ఒప్పందంపై సంతకం అయ్యాక తనని అవాయిడ్ చేశారని `బిగ్ బాస్` నిర్వాహకులపై యూట్యూబ్ సెన్సేషన్ .. యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపించారు. ఏప్రిల్ లో బిగ్ బాస్ షో నిర్వాహకులు తనకు ఫోన్ చేసి తమ రియాల్టీ షోకు సెలక్ట్ చేశామని తెలిపారు. కలవాలి మేడం అంటూ స్టార్ మా నుంచి ఓ కో ఆర్టినేటర్ తనకు ఫోన్ చేశారని అయితే తాను సిద్ధమేనని చెప్పాక ఊహించని పరిణామాలు ఎదురయ్యాయని శ్వేతారెడ్డి తెలిపారు.
తాను ఒప్పందంపై సంతకం చేశాక ఆ అంగీకార పత్రంలో హిడెన్ అజెండా ఉందని ఆరోపించడం సంచలనమైంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ స్టార్ కాబట్టే ఎంపిక చేశామని ముంబై లాంగ్వేజ్ హెడ్ తెలిపారు. శ్రీనగర్ కాలనీలోని మింట్ లీఫ్ రెస్టారెంటులో జరిగిన మీటింగులో బాండ్ పేపర్ పై సంతకాలు చేశాను. అయితే బాండ్ పేపర్లపై ఏం ఉందో పూర్తిగా చదవకుండానే సంతకం చేశానని అయితే అలాంటి సంస్థ చీట్ చేస్తుందని తాను భావించలేదని తెలిపారు. సంతకం చేశాక పైనల్ అయ్యాననే అనుకున్నాను. కానీ ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది. మరో మీటింగులో వేరొక కో-ఆర్డినేటర్ గేమ్ వివరాల్ని చెబుతామని అన్నారు. అతడు పిలిచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి? అని అడిగారు. అయితే వాళ్లే నా ఆఫీసుకు వచ్చి మీటింగులకు రమ్మని ఇప్పుడిలా అడిగారని ఆరోపించారు.
మిమ్మల్ని తీసుకుంటే మాకేం లాభం? షో హిట్ అవ్వాలంటే మీరు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఎలాంటి యాక్టివిటీ ప్లే చేస్తారు? అంటూ షో కోఆర్డినేటర్ వ్యక్తి అడిగారు. అయితే గేమ్ ప్రారంభం కాకముందే ఇవేం ప్రశ్నలో అర్థం కాలేదని అన్నాను. దానికి అతడు ప్రతిస్పందిస్తూ ``అలా కాదండీ.. మా బాస్‌ను మీరు ఎలా ఇంప్రెస్ చేస్తారు?`` అంటూ అడిగారని తెలిపారు. ఈ ప్రశ్న అడగడంలో మీ ఉద్ధేశమేంటి? నానుంచి ఏం కోరుకుంటున్నారు? బాస్ ను సంతృప్తి పరచడమేంటి? కమిట్ మెంట్ అడుగుతున్నారా? అంటూ ప్రశ్నించానని శ్వేతారెడ్డి తెలిపారు. కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన తనకే ఈ సన్నివేశం ఎదురైందని ఆరోపించారు. తాను ప్రశ్నించాక ఇక తన ఫోన్ కాల్స్ అవాయిడ్ చేశారని.. సెలెక్టయ్యాక ఇన్ని సన్నివేశాలు ఎదురయ్యాయని తెలిపారు. ``హౌ విల్ యూ సాటిస్ ఫై మై బాస్?` అని అడగటం వెనక అసుల కారణమేంటి అంటూ శ్వేతారెడ్డి ప్రశ్నించారు.