Begin typing your search above and press return to search.
యాంకర్ శ్యామల చెప్పిన చేదు నిజాలు
By: Tupaki Desk | 7 Feb 2018 10:25 AM GMTచాలా హోమ్లీగా ఉండే యాంకర్స్ లో సుమ తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు శ్యామల. అడపదడపా సినిమాల్లో చేస్తున్నా బుల్లితెరతో పాటు ఆడియో వేడుకలు - ప్రీ రిలీజ్ ఫంక్షన్లను చక్కగా బాలన్స్ చేసుకుంటున్న శ్యామలకు కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయట. తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఇవన్ని వెల్లడించింది. కొంత కాలం క్రితం ఏదో బ్లూ ఫిలిం లో వేరే మోడల్ శరీరానికి తన తల అతికించి మార్ఫింగ్ చేసి వైరల్ చేసారని అది తన భర్త చూసే దాకా వెళ్లిందని చెప్పిన శ్యామల భర్త కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకున్నారని, అదే సాధారణ మహిళ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోమని చెప్పింది. సోషల్ మీడియాలో కామెంట్స్ ను పట్టించుకోవడం మానేసానని, మొదట్లో బాధ అనిపించినా తర్వాత అనవసరం అనిపించి వదిలేసానని చెప్పింది.
యాంకర్ ప్రదీప్ తో కో యాంకరింగ్ చేయటం వల్ల సినిమా ఫంక్షన్లు ధైర్యంగా చేయగలుగుతున్నానని, అతను ఇచ్చిన టిప్స్ తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది. రవి మాత్రం ఎప్పుడు రెడ్ బుల్ తాగినంత హుషారుగా ఉంటాడని, అతని ఎనర్జీ భలే ఉంటుందని వీరితో సహా సుమ - అనసూయ - రేష్మి అందరితో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది . పెళ్లి విషయంలో మాత్రం తన అమ్మను బాధపెట్టాల్సి వచ్చిందట. 19 ఏళ్ళకే పెళ్లి చేసుకోవడం వల్ల ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కొంత కాలం వెంటాడిందట. టాలీవుడ్ లో మహేష్ బాబు - అనుష్క బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ శ్యామల ఫేవరేట్ యాక్టర్స్. కబుర్లు చాలానే షేర్ చేసుకున్న శ్యామల ప్రస్తుతమున్న పేరు, అవకాశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది.
సెలెబ్రిటీల విషయంలో సోషల్ మీడియాలో ఎన్నెన్ని దారుణాలు జరుగుతూ ఉంటాయో శ్యామల చెప్పిన సంఘటన ద్వారా మరోసారి బయట పడింది. టెక్నాలజీ పెరుగుతోంది అని ఆనందపడుతుంటే మరోపక్క దీని దుర్వినియోగం చేసి కొందరు చేసే తప్పుల వల్ల తారలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఒక ఫిలిం క్రిటిక్ కు, స్టార్ హీరో ఫాన్స్ కు రేగిన వివాదం పరిశీలిస్తే సోషల్ మీడియా లేకపోయి ఉంటే అంత రాద్ధాంతం జరిగేది కాదు అనే కామెంట్ లో నిజం లేకపోలేదు .