Begin typing your search above and press return to search.

ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను

By:  Tupaki Desk   |   4 Sep 2016 5:22 AM GMT
ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఉదయభాను
X
ప్రముఖ యాంకర్ ఉదయభాను గత కొన్ని నెలలుగా టివిల్లో కనిపించట్లేదు. విషయం ఏంటా అని ఆరాతీస్తే ఆమె ప్రగ్నెంట్ అనే విషయం రివీల్ చేసింది. అయితే ముందుగానే ఆమెకు ట్విన్స్ (కవలలు) పుడతారని డాక్టర్లు తేల్చిన విషయం తెలిసిందే.

అయితే నిన్న మధ్యాహ్నం బంజారా హిల్స్ లోన ఒక ప్రముఖ హాస్పిటల్ లో ఇద్దరు ఆడ కవలపిల్లలకు జన్మనిచ్చింది ఉదయభాను. ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అయితే ఇద్దరూ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ పుట్టారని తెలుస్తోంది. యాంకర్ ఉదయభాను పీక్స్ లో ఉండగానే కాంట్రాక్టర్ విజయ్ ను పెళ్ళిచేసుకుంది. ఇన్నాళ్ళూ కెరియర్ లో బిజీగా ఉండటం వలన పిల్లలను కాస్త లేట్ గా ప్లాన్ చేశామని తెలపింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఉదయభాను అండ్ హజ్బండ్ విజయ్ కు విషెస్ చెబుదాం.