Begin typing your search above and press return to search.

బాలీవుడ్ కి బ‌ద్దకం పెరిగిపోయిందా?

By:  Tupaki Desk   |   16 Dec 2022 1:30 PM GMT
బాలీవుడ్ కి బ‌ద్దకం పెరిగిపోయిందా?
X
ఒక‌ప్పుడు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంటే ఇండియ‌న్ సినిమాకి పెట్టింది పేరుగా నిలిచింది. భారీ బ‌డ్జెట్ చిత్రాలు నిర్మించాలంటే? బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కే సాధ్యం. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేయాలంటే? వాళ్ల‌కి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యే ప‌ని అని ఎన్నో చిత్రాలు నిరూపించాయి. చారీత్రాత్మ‌క నేప‌థ్యం ఉన్న‌సినిమాలు చేయాల‌న్నా...భారీ యాక్ష‌న్ చిత్రాలు..విజువ‌లైజ్డ్ మూవీస్ చేయాల‌న్న కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో ముడిప‌డి ఉంటుంది.

ఆ విష‌యంలో నిర్మాణ సంస్థ‌లు వెన‌క్కి త‌గ్గేవి కాదు. కోట్ల రూపాయాలు వెచ్చించ‌డంలో బడా నిర్మాణ సంస్థ‌ల మ‌ధ్య గ‌ట్టిపోటీ ఉండేది. అంత‌టి శ‌క్తి కేవ‌లం బాలీవుడ్ లో మాత్ర‌మే క‌నిపించేది. ద‌ర్శ‌క‌..ర‌చ‌యిత‌లు క్రియేటివ్ ప‌రంగానూ ఎంతో లోతైన విశ్లేష‌ణ ఉండేది. ఓ సినిమా చేస్తే అందులో ద‌ర్శ‌కుడి క‌సి ప‌ట్టుద‌ల క‌నిపించేది. హీరోల అంకిత‌భావం అలాగే ఉండేది.

బాలీవుడ్ దేశ వ్యాప్తంగా ఆ స్థాయిలో ఫేమ‌స్ అయ్యిందంటే? ఇన్ని కార‌ణాలున్నాయి. మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల‌తో బాలీవుడ్ కి ఏమాత్రం పోలిక ఉండేది. ఆ ర‌కంగా భార‌త‌దేశంలోనే అతి పెద్ద సినీ ప‌రిశ్ర‌మ‌గా బాలీవుడ్ గుర్తింపు ద‌క్కించుకుంది. మ‌రి నేడు బాలీవుడ్ ప‌రిస్థితి ఎలా ఉంద‌న్న‌ది తెలిసిందే. కొంత కాలంగా అక్క‌డ ఇండ‌స్ర్టీకి వంద‌ల కోట్లు వ‌సూళ్లు తెచ్చే సినిమాలే క‌నిపించ‌లేదు.

కోవిడ్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి ప‌రిస్థితి అంత‌కంత‌కు దిగ‌జారింది. హిట్లు లేక సక్సెస్ కోసం ప‌రాయి ప‌రిశ్ర‌మ‌ల స‌హాయం కోరాల్సి వ‌స్తుంది. దీనికి తోడు కొత్త స‌వాళ్ల‌ను ఎదుర్కోంటుంది. మ‌రి వీట‌న్నింటికి ప్ర‌ధాన కార‌ణాలు ఏంటి? అంటే ప‌రిశ్ర‌మ‌లో బ‌ద్దకం పెరిగిపోయింద‌న్న రీజ‌న్ హైలైట్ అవుతుంది. కార్పోరేట్ కంపెనీలు నిర్మాణ రంగంలోకి ఎంట‌ర్ అవ్వ‌డంతోనే ఈ ప‌రిస్థితి దాప‌రించింద‌ని కొంత‌మంది నిపుణులు విశ్లేషిస్తున్నారు.

నీకెంత‌..నాకెంత అన్న ఆలోచ‌న త‌ప్ప‌! స‌క్సెస్ మాటేంటి? అన్నదే కొంత కాలంగా ఇండ‌స్ర్టీలో చ‌ర్చ‌కు రావ‌డం లేదంటున్నారు. ద‌ర్శ‌కుల్లో ఒక‌ప్ప‌టి క‌సి ..ప‌ట్టుద‌ల క‌న‌పించ‌లేదంటున్నారు. క్రియేటిప్ ప‌రంగా లోపాలు ఎత్తి చూపుతున్నారు. హీరోలు న‌టించ‌డం వ‌ర‌కే త‌మ ఫ‌రిదిగా భావిస్తున్నారు త‌ప్ప‌..వ్య‌క్తిగ‌తంగా సినిమా స్థితి గ‌తులు గురించి ఆలోచించే వారే లేర‌ని అంటున్నారు.

హిట్ అయితే వాట‌ల్లో లాభాల కోసం ముందుకొస్తున్నారు త‌ప్ప ప్లాప్ అయితే! అందుకు గ‌ల కార‌ణాలు విశ్లేషించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు వినిపిస్తుంది. కార్పోరేట్ కంపెనీలు లాభాల కోసం కాకుండా? వ్య‌క్త‌గ‌త స్వలాభాలు ఆశించి పెట్టు బ‌డులు పెడుతున్నాయి! త‌ప్ప ఫ్యాష‌న్ తో నిర్మాణం రంగంలోకి రావ‌డం లేద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.