Begin typing your search above and press return to search.

ప్రేక్ష‌కుల్ని మ‌రీ ఇలా అండ‌రెస్టిమేట్ చేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   29 Oct 2022 2:30 AM GMT
ప్రేక్ష‌కుల్ని మ‌రీ ఇలా అండ‌రెస్టిమేట్ చేస్తే ఎలా?
X
గ‌త కొన్ని నెల‌లుగా ప్రేక్ష‌కుల అభిరుచి మారింది. కంటెంట్ వున్న సినిమాకే ప‌ట్టంక‌డుతున్నారు. స్టార్ వున్నాడా?  లేడా.. అన్న‌ది పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కంటెంట్ న‌చ్చితే స్టార్ హీరో సినిమా అయినా ఊరూ పేరు లేని హీరో సినిమా అయినా స‌రే అక్కున చేర్చుకుంటున్నారు. జేజేలు ప‌లుకుతూ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌లైన క‌న్న‌డ సినిమా `కాంతార‌`నే ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

ఇందులో న‌టించి, డైరెక్ట్ చేసిన రిష‌బ్ శెట్టి ఎవ‌రో ఈ సినిమా వ‌ర‌కు తెలుగు ఆడియ‌న్స్ కి తెలియ‌దు. కానీ  ఈ సినిమాని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని చేశారు. కంటెంట్ కింగ్ అని మ‌రో సారి నిరూపించారు. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `గాడ్ ఫాద‌ర్‌` థియేట‌ర్లో వున్నా ఆ సినిమాకు రాని క్రేజ్‌.. క‌లెక్ష‌న్స్ రిష‌బ్ శెట్టి న‌టించి తెర‌కెక్కించిన `కాంతార‌`కు ల‌భించాయంటే అర్థం చేసుకోవ‌చ్చు ప్రేక్ష‌కులు కంటెంట్ విష‌యంలో ఎంత క్లారిటీతో వున్నారో.

ఈ నేప‌థ్యంలో కంటెంట్ లేని ఏ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చినా ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌నీసం ఆశించిన స్థాయిలో టికెట్స్ కూడా తెగ‌డం లేదు. ఈ ప‌రిస్థితుల్లో చాలా వ‌ర‌కు చిన్న సినిమాలు థియేట‌ర్ల‌కు రాకుండా ఓటీటీ బాట‌ప‌డుతున్నాయి. ఈ మ‌ధ్య అక్క‌డ కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కంటెంట్ వున్న సినిమాల‌కే ఓటీటీ వారు పెద్ద పీట వేయ‌డం మొద‌లు పెట్టాడ‌రు. స‌వా ల‌క్షా కండీష‌న్ లు పెడుతున్నారు.

అలాంటి కండీష‌న్ ల‌న్నింటినీ దాటి ఓటీటీలోకి వ‌చ్చేసింది ఆలీ న‌టించి స్నేహితుల‌తో క‌లిసి నిర్మించిన `అందూ బాగుండాలి అందులో నేనుండాలి`. ఆహా ఓటీటీలో అక్టోబ‌ర్ 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ మొద‌లైంది. సీనియ‌ర్ న‌రేష్, ప‌విత్రా లోకేష్ ఇందులో జంట‌గా న‌టించారు. చాలా కాలం క్రిత‌మే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ ఫైన‌ల్ గా ఓటీటీలోకి వ‌చ్చేసింది. మ‌ల‌యాళ మూవీ ఆధారంగా మ‌క్కీటూ మ‌క్కీ దించేసిన ఈ మూవీ ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఓ ఫొటో వైర‌ల్ కావ‌డం నేప‌థ్యంలో ఈ సినిమాని రూపొందించారు.

కిర‌ణ్ శ్రీ‌పురం రూపొందించిన ఈ మూవీలో ఆలీపై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు, పాట‌లు ప్రేక్ష‌కుల‌కు విసుగు తెప్పించేలా వున్నాయి. కంటెంట్ కు మాత్రం ప్ర‌ధాన్య‌త నిస్తున్న ఈ రోజుల్లో ఓ ఫొటో వైర‌ల్ కావ‌డం.. దాని కార‌ణం ఓ వ్య‌క్తి అవ‌మానాలు ఎదుర్కోవ‌డం అనే సిల్లీ పాయింట్ తో రూపొందించిన ఈ మూవీని ప్రేక్ష‌కులు భ‌రించ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అన్నీ తెలిసి కూడా ఆలీ ప్రేక్ష‌కుల్ని ఎందుకిలా అండ‌రెస్టిమేట్ చేశాడ‌ని కౌంట‌ర్ లు ప‌డుతున్నాయి. ఓటీటీలో రిలీజ్ చేశారు కాబ‌ట్టి సేఫ్.. అదే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసి వుంటే ప‌రిస్థితి ఎలా వుండేదో ఊహించుకోవ‌చ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.