Begin typing your search above and press return to search.
భీమ్లా కోసం తెలంగాణలో వాలిపోతున్న ఆంధ్రా ఫ్యాన్స్..!
By: Tupaki Desk | 24 Feb 2022 12:43 PM GMTపవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీనికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన అన్ని ఏరియాల్లో దాదాపుగా హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఏపీలోనే పవన్ సినిమాకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
'భీమ్లా నాయక్' సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ లో తీసుకొచ్చిన జీవోని కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే థియేటర్లకు ముందస్తు నోటీసులు జారీ చేసింది.
బెనిఫిట్ షో - అదనపు షోలు వేయడానికి అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అదే విధంగా సినిమా టికెట్ రేట్లు కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉండాలని పేర్కొంది.
థియేటర్లపై రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుందని పేర్కొంటూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సినిమాటోగ్రఫీ చట్టం 1952 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో వెల్లడించింది. దీనికి థియేటర్ యాజమాన్యం సహకరించాలని కోరుతూ.. ఈమేరకు అన్ని జిల్లాల్లోని తహసీల్దార్లు వారి పరిధిలోని థియేటర్లకు నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'భీమ్లా నాయక్' సినిమాకు 5 షోలు ప్రదర్శించుకోడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ సర్కార్.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ అదనపు ఐదో ఆట వేసుకోడానికి అనుమతిని మంజూరు చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో వైసీపీ ప్రభుత్వం పవన్ సినిమాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' బెనిఫిట్ షో కోసం ఆంధ్రాలోని పీకే ఫ్యాన్స్ తెలంగాణాలో వాలిపోతున్నారని తెలుస్తోంది. ఏపీలో బెనిఫిట్ షో సహా ఐదో షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు భాగ్యనగరానికి పయనమవుతున్నారు.
'శ్యామ్ సింగరాయ్' సినిమా సమయంలో థియేటర్ల మీద కొరడా జులిపించిన ఏపీ సర్కారు.. ఆ తర్వాత సైలెంట్ గా ఉంది. ఈ గ్యాప్ లో రిలీజ్ అయిన చిత్రాల జోలికి ప్రభుత్వం అధికారులు వెళ్లలేదు. వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రత్యేకంగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు భీమ్లా మూవీ విడుదల నేపథ్యంలో ఉన్నట్టుండి ఆదేశాలు జారీ చేసారు.
కేవలం పవన్ కల్యాణ్ సినిమాని ఇబ్బంది పెట్టడానికే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా వేధింపులకు గురి చేసినా సినిమా విజయాన్ని అడ్డుకోలేరని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్జాగా స్పెషల్ షోలు చూసుకోవచ్చు అంటూ హైదరాబాద్ కు బయలు దేరుతున్నారని తెలుస్తోంది.
కాగా, 'వకీల్ సాబ్' తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న 'భీమ్లా నాయక్' చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. దగ్గుబాటి రానా మరో హీరోగా నటిస్తుండడం సినిమాకు అదనపు ఆకర్షణ. నిత్యా మీనన్ - సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు.
సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీ కోసం కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరి రేపు రిలీజ్ కానున్న పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.