Begin typing your search above and press return to search.
ఏపీలో సినిమా ఫంక్షన్లు.. ఇక బేఫికర్
By: Tupaki Desk | 23 Feb 2016 7:30 AM GMTఒకప్పుడు తెలుగు సినిమాల ఆడియో వేడుకలన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. కానీ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక పరిస్థితి మారిపోయింది. ‘బాహుబలి’ ఆడియో వేడుకకు తిరుపతి వేదికైంది. డిక్టేటర్ ఆడియోను అమరావతిలో విడుదల చేశారు. అంతకుముందు ‘సౌఖ్యం’ ఆడియో వేడుకను ఒంగోలులో చేశారు. ‘రుద్రమదేవి’ ఆడియోను విజయవాడలో, వరంగల్ లో రిలీజ్ చేశారు. త్వరలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకను కూడా అమరావతిలో చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రం రెండుగా విడిపోయాక.. మన నిర్మాతల ఆలోచన మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు తెలుగు సినిమా దూరం కాలేదని చాటడానికి.. ఆ ప్రాంతంలో ఆడియో వేడుకలు, సక్సెస్ మీట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జనాల నుంచి స్పందన కూడా బాగానే ఉంటోంది.
ఐతే హైదరాబాద్‌లో శిల్ప కళా వేదిక తరహాలో ఆంధ్రప్రదేశ్ లో ఆడియో వేడుకలు చేసుకోవడానికి అన్ని వసతులూ ఉన్న ఆడిటోరియాలు లేవు. చాలా వరకు ఈ కార్యక్రమాల్ని మైదానాల్లో తాత్కాలికంగా వేదికలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. ఐతే ఇది చాలా శ్రమతో కూడుకున్నది. పైగా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అభిమానుల్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రాంతంలో శిల్ప కళా వేదిక తరహాలో ఓ ఆడిటోరియం నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వమే దీన్ని నిర్మించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం బాలయ్యకు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కూడా అప్పగించాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ వేడుకల కోసం శిల్ప కళా వేదిక తరహా ఆడిటోరియం నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.