Begin typing your search above and press return to search.
తెలంగాణ, ఆంధ్రా నిర్మాతలు కలిసిపోయారు
By: Tupaki Desk | 17 July 2015 5:40 PM GMTటాలీవుడ్లో తరచుగా ఓ మాట వినిపిస్తుంటుంది. ‘‘ఆ నలుగురు నిర్మాతలు కలిసి థియేటర్లను తమ గుప్పెట్లో ఉంచేసుకున్నారు. చిన్న సినిమా చంపేస్తున్నారు’’ అని. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా.. పరిస్థితిలో మార్పు కనిపించట్లేదు. ఐతే ఆ నలుగురికి చెక్ చెప్పి తీరడం కోసం ఆంధ్రా, తెలంగాణ నిర్మాతలందరూ ఒక్కతాటిపైకి వస్తున్నట్లు సమాచారం. ఈ నెల 19న జరగబోయే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ) ఎన్నికల్లో తెలంగాణ నిర్మాతలకు ఆంధ్రా నిర్మాతల నుంచి ఫుల్ సపోర్ట్ లభించబోతున్నట్లు సమాచారం.
సాధారణంగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఆంధ్రా నిర్మాతల ఆధిపత్యం కనిపిస్తుంటుంది. ఐతే ఈసారి ఆ పరిస్థితి ఉండబోదని అంటున్నారు. కొందరు బడా నిర్మాతలు తెలంగాణ నిర్మాతలతో రాజీ ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఐతే చివరి నిమిషంలో ఆ ఒప్పందం బెడిసి కొట్టి తెలంగాణ నిర్మాతలు ఎన్నికల్లో నిలిచేందుకు తయారవుతున్నారు.
వీరికి దాదాపు 300 మంది ఆంధ్రా ప్రాంతం నిర్మాతల నుంచి మద్దతు లభిస్తున్నట్లు సమాచారం. చిన్న సినిమా కోసం గళం విప్పే దాసరి నారాయణరావుతో పాటు ఆదిశేషగిరిరావు కూడా తెలంగాణ నిర్మాతల వైపే ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో కొందరి గుత్తాధిపత్యానికి తెరదించాలంటే.. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకాలంటే మార్పు రావాల్సిందేనన్న ఉద్దేశంతో ఇలా తెలంగాణ, ఆంధ్రా నిర్మాతలు కలిసిపోయినట్లు చెబుతున్నారు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో సంచలన ఫలితాలు ఖాయమని తెలుస్తోంది.