Begin typing your search above and press return to search.
ఏపీ ఆన్లైన్ టికెటింగ్ రగడ.. ఎగ్జిబిటర్ల అభ్యంతరాలు ఏంటంటే..?
By: Tupaki Desk | 17 Jun 2022 12:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల విక్రయాల కోసం ఆన్ లైన్ పోర్టల్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆన్ లైన్ సినిమా టికెట్ల విధానాన్ని తప్పనిసరి చేస్తూ జూన్ 2న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిర్వహణ బాధ్యతలను ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు (APFDC) అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేస్తూ 30 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఒప్పంద పత్రాలను (ఎంవోయూ) థియేటర్ల యాజమాన్యాలకు పంపించారు. అయితే అందులో నియమ నిబంధనలపై ఎగ్జిబిటర్స్ అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆన్ లైన్ లో సినిమా టికెట్లు అమ్మకాలతో వచ్చిన సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖాతాకి చేరితే.. ఆ తర్వాత అందులో సర్వీస్ ట్యాక్స్ ను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఎగ్జిబిటర్ల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సర్కారు చెబుతోంది. దీనికి తప్పనిసరిగా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకోవాల్సిందేనని.. గడువులోగా ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సు రద్దు చేస్తామంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
సినిమా టికెట్లు ఆన్ లైన్ లో అమ్మడం వరకూ బాగానే ఉన్నా.. టికెట్ల విక్రయించిన తర్వాత థియేటర్ల యజమానుల ఖాతాల్లోకి ఎన్ని రోజుల్లో డబ్బు జమ చేస్తారనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఆ సొమ్ము ఎగ్జిబిటర్స్ కు చెల్లించకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.
నేరుగా ప్రభుత్వ నిర్వహణ ఖాతాలోకి వెళ్లిన టికెట్ల డబ్బులు.. సకాలంలో తిరిగి రాకపోతేనో లేదా అక్కడే ఆగిపోతే తమ పరిస్థితి ఏంటని ఎగ్జిబిటర్స్ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. సినిమా ప్రదర్శన లేకపోతే అడ్వాన్సు టికెట్లు బుక్ చేసుకున్నవారికి తిరిగి డబ్బులు ఎవరు చెల్లించాలి? థియేటర్ కు వచ్చి టికెట్ తీసుకునే వారిపైనా 2% ట్యాక్స్ విధిస్తారా? అనే దానిపైనా క్లారిటీ కోరుతున్నారు.
ఒప్పంద ఉల్లంఘన జరిగితే అమరావతిలోని మధ్యవర్తిత్వ కేంద్రంలో పరిష్కరించుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ అక్కడ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటే ఎగ్జిబిటర్లకు న్యాయం జరుగుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పలు విషయాలపై స్పష్టత రానిదే ఒప్పందాలు కుదుర్చుకోవడానికి థియేటర్ యజమానులు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే చాలా థియేటర్లు పేటీఎం - బుక్ మై షో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయా సంస్థల నుంచి భారీగా అడ్వాన్సులు కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాటి కాలపరిమితి ముగియకుండా.. ఏపీఎఫ్డీసీతో ఒప్పందం కుదుర్చుకోవడం అనేది విరుద్ధం. ఒకవేళ ఆ సంస్థలు ఇప్పటికప్పుడు అడ్వాన్సులు తిరిగివ్వాలంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వగలమనేది కొందరు ఎగ్జిబిటర్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇకపోతే తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇదే అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసింది. టికెట్ల విక్రయాలను ఫిల్మ్ చాంబర్ ద్వారా చేపట్టాలని.. ఆ లింక్ ను ఏపీఎస్ఎటీవీటీడీసీకి అందజేస్తామని.. తద్వారా ఆన్లైన్ టికెట్ల ఆదాయం, థియేటర్ ఆక్యుపెన్సీ లాంటివి ఎప్పటికప్పుడు తెలుస్తాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందులో వివరించారు.
నిజానికి ఆన్ లైన్ టికెటింగ్ విధానం తీసుకురమ్మని సినీ ప్రముఖులే ప్రభుత్వాలను కోరారు. ఈ విషయాన్ని టాలీవుడ్ పెద్దలు స్వయంగా వెల్లడించారు. బ్లాక్ టికెటింగ్ దందాకు చెక్ పెట్టడానికి.. అంతా పారదర్శకంగా జరగడానికి ఈ సిస్టమ్ రావాలని కోరుకున్నారు. అయితే ప్రభుత్వం గైడ్ లైన్స్ లో కొన్నింటిపై థియేటర్ల యజమానులకు స్పష్టత రావడం లేదు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఆన్లైన్ విధానంలో టికెట్లు విక్రయించే బాధ్యతలను ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ - ఎస్ఆర్ఎస్ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు జస్ట్ టికెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అప్పగించింది. జస్ట్ టికెట్స్ లో నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేశ్ (బాబీ) డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే.