Begin typing your search above and press return to search.
సింగర్ కం నటి యోగా ఫీట్లు పాట్లు ఏమిటో
By: Tupaki Desk | 4 Jun 2021 2:30 PM GMTప్రముఖ యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో గాయని కం నటి ఆండ్రియా జెరోమీ డీప్ గా ప్రేమలో పడి అటుపై బ్రేకప్ అయ్యిందని ప్రచారం సాగింది. అయితే ఆ వార్తల్ని ఆ తర్వాత ఆ ఇద్దరూ ఖండించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం డిప్రెషన్ నుంచి తాను ఎలా బయటపడిందో కూడా ఆండ్రియా వెల్లడించారు.
2021 సంక్రాంతి బరిలో రిలీజైన `మాస్టర్` చిత్రంలో ఆండ్రియా అతిథి పాత్రలో కనిపించింది. అయితే తన పాత్రకు ప్రాధాన్యత లేదని ఆండ్రియా తీవ్ర కలతకు గురయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మిస్కిన్ దర్శకత్వంలో పిశాచు-2... దిల్ సత్య దర్శకత్వం లో `మాళిగై`తో పాటు `కో` అనే డిఫరెంట్ జానర్ చిత్రంలోనూ నటిస్తోంది. సెకండ్ వేవ్ వల్ల ఇవన్నీ షూటింగులు ఆలస్యమవుతోంది.
కరోనా ఈసారి చెన్నైని మరింతగా ఒణికించింది. ఆ క్రమంలోనే నగరంలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ సీజన్ లో ఖాళీ సమయాన్ని ఆండ్రియా సద్వినియోగం చేసుకుందిట. ఇదిగో ఇలా నిరంతరం యోగా ధ్యానం అంటూ పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. అలా మెడ కండరాలపై ఒత్తిడి పెంచే ప్రత్యేక ఆసనాన్ని వేస్తోంది. దీనివల్ల మెడ నొప్పి తగ్గి బ్రెయిన్ లోంచి ఒత్తిడి రిలీజవుతుంది. మొత్తానికి ఆండ్రియా కంబ్యాక్ కోసం చాలానే ప్లానింగ్ తో ఉందన్నమాట.